Pramod Bhagat: టోక్యో పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో పసిడి పతకం వరించింది. ఈ పారాలింపిక్స్‌లో ఇప్పటికే ముగ్గురు క్రీడాకారులు స్వర్ణ పతకాలు సాధించగా.. తాజాగా మరోకరికి స్వర్ణం వరించింది. ఈ సాయంత్రం జరిగిన బ్యాడ్మింటన్ మెన్స్ సింగిల్స్ ఫైనల్ మ్యాచ్‌లో షట్లర్ ప్రమోద్ భగత్ ఘన విజయం సాధించాడు. బ్రిటన్‌కు చెందిన డేనియల్ బెథెల్‌ను 21-14, 21-17 తేడాతో రెండు వరుసగా రెండు సెట్లల్లో 45 నిమిషాల్లో ఓడించి పసిడి పతకాన్ని కైవసం చేసుకున్నాడు.
దీంతోపాటు పారాలిపిక్స్‌లో ఇదే విభాగంలో మనోజ్ సర్కార్ సైతం కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. మనోజ్ సర్కార్ జపాన్‌కు చెందిన డైసుకే ఫుజిహారాను 22-20 21-13 తేడాతో ఓడించి కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు. దీంతో పారాలింపిక్స్‌లో భారత క్రీడాకారులు సాధించిన స్వర్ణ పతకాల సంఖ్య నాలుగుకు చేరింది. దీంతో మొత్తం పతకాల సంఖ్య 17కు చేరింది. 4 స్వర్ణాలు, 7 రజతాలు, 6 కాంస్యాలతో పతకాల జాబితాలో భారత్ 25 వ స్థానానికి ఎగబాకింది.
It’s official Pramod Bhagat wins first ever GOLD for India in the first ever edition of #ParaBadminton at #Paralympics pic.twitter.com/J4zgwwMmu2
— Doordarshan Sports (@ddsportschannel) September 4, 2021
కాగా.. పారాలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ విభాగంలో సత్తా చాటిన స్వర్ణ, కాంస్య పతకాలు సాధించిన ప్రమోద్ భగత్, మనోజ్ సర్కార్‌లకు ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్‌లో శుభాకాంక్షలు తెలిపారు. ప్రమోద్ భగత్, మనోజ్ సర్కార్ అద్భుతమైన ఆటతో దేశ ప్రజల హృదయాలను గెలుచుకున్నారంటూ కొనియాడారు. ఇదిలాఉంటే.. ప్రమోద్ భగత్.. పారాలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ విభాగంలో స్వర్ణం సాధించిన తొలి భారతీయుడిగా చరిత్రలో నిలిచాడు.
Pramod Bhagat has won the hearts of the entire nation. He is a Champion, whose success will motivate millions. He showed remarkable resilience & determination. Congratulations to him for winning the Gold in Badminton. Best wishes to him for his future endeavours. @PramodBhagat83
— Narendra Modi (@narendramodi) September 4, 2021
Also Read: