T20 WORLD CUP: పాకిస్తాన్ పతనం కోసం ఆడుతున్నారా.. టీమిండియా ప్రదర్శనపై ఆ మాజీ క్రికెటర్ అసహనం..

|

Oct 31, 2022 | 8:46 AM

టీ20 ప్రపంచకప్ సూపర్ 12లో భాగంగా జరిగిన మొదటి రెండు మ్యాచుల్లో విజయం సాధించడంతో భారత క్రికెట్ జట్టుపై అందరి అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో విజయం తర్వాత టీమిండియాపై..

T20 WORLD CUP: పాకిస్తాన్ పతనం కోసం ఆడుతున్నారా.. టీమిండియా ప్రదర్శనపై ఆ మాజీ క్రికెటర్ అసహనం..
Shoaib Akhtar
Follow us on

టీ20 ప్రపంచకప్ సూపర్ 12లో భాగంగా జరిగిన మొదటి రెండు మ్యాచుల్లో విజయం సాధించడంతో భారత క్రికెట్ జట్టుపై అందరి అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో విజయం తర్వాత టీమిండియాపై అందరూ ప్రశంసల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. ఎప్పుడూ భారత్ ఓటమిని కోరుకునే పాకిస్తాన్ సైతం అక్టోబర్ 30వ తేదీన దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో రోహిత్ సేన గెలవాలని ఆకాంక్షించింది. కొంతమంది పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు అయితే భారత్ గెలవాలంటూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన విషయం తెలిసిందే. భారత్ పై అభిమానం కంటే దక్షిణాఫ్రికాను ఓడిస్తే పాకిస్తాన్ సెమీస్ అవకాశాలు పదిలంగా ఉంటాయనే ఆలోచనతో పాకిస్తాన్ క్రికెట్ అభిమానులతో పాటు.. మాజీ పాకిస్తాన్ క్రికెటర్లు కోరుకున్నారు. అయితే దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో భారత్ ఓటమి చెందింది. దీంతో పాక్ అభిమానులు సైతం నిరాశకు గురయ్యారు. సఫారీలతో మ్యాచ్ సందర్భంగా మొదటి బ్యాటింగ్ చేసిన భారత క్రికెట్ జట్టు 8 ఓవర్లు పూర్తి కాకుండానే 42 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో టీమ్‌ఇండియా ప్రదర్శనపై పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్‌ అక్తర్‌ అసహనం వ్యక్తం చేశాడు. భారత్‌ జట్టు నాలుగు వికెట్లు పడినప్పుడు షోయబ్ అక్తర్‌ పోస్టు చేసిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.

పాకిస్తాన్ కోసం భారత్ గెలవాలని తాను ఓ వీడియోలో చెప్పాను. కానీ వీళ్లు పాక్‌ పతనం కోసం ఆడుతున్నట్టుగా కనపడుతున్నారు. ఇప్పటికే నాలుగు వికెట్లు పోగొట్టారు. ఇక ముందు ఏం జరగబోతుందే తెలియడం లేదు అంటూ తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. టాప్‌ ఆర్డర్‌ బ్యాటర్లు రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌, విరాట్‌ కోహ్లీ, దీపక్ హుడా దక్షిణాఫ్రికా బౌలర్ ల దాటికి తక్కువ స్కోర్ కే పెవిలియన్ చేరారు. దీంతో పాకిస్తాన్ పతనం కోసమే భారత్ ఆడుతున్నట్లుగా ఉందంటూ షోయబ్ అక్తర్ చేసిన వ్యాఖ్యల వీడియో తెగ వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 133 పరుగుల చేయగా.. అనంతరం దక్షిణాఫ్రికా ఐదు వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసి విజయం సాధించిన విషయం తెలిసిందే. షోయబ్ అక్తర్ తో పాటు ఎంతో మంది పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు, పాక్ క్రికెట్ అభిమానులు సైతం దక్షిణాఫ్రికాపై భారత్ ఓటమితో నిరాశ చెందారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం చూడండి..