Fifa World Cup: టాప్‌ విప్పేసి.. మోకాళ్లపై కూర్చొని.. రొనాల్డొపై ప్రేమను వినూత్నంగా చాటుకున్న లేడీ ఫ్యాన్‌

|

Dec 06, 2022 | 10:22 AM

రొనాల్డో గురించి తెలిసిన వారికి అతని సుయ్‌ సెలబ్రేషన్‌ కూడా బాగా తెలిసి ఉంటుంది. చాలామంది అతని సెలబ్రేషన్‌ను అనుసరిస్తున్నాడు. టీమిండియాలో మహ్మద్‌ సిరాజ్ కూడా వికెట్‌ తీసినప్పుడల్లా సుయ్‌ తరహాలో సెలబ్రేట్ చేసుకోవడం మనం చూశాం.

Fifa World Cup: టాప్‌ విప్పేసి.. మోకాళ్లపై కూర్చొని.. రొనాల్డొపై ప్రేమను వినూత్నంగా చాటుకున్న లేడీ ఫ్యాన్‌
Cristiano Ronaldo
Follow us on

పోర్చుగల్‌ ఫుట్‌బాల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డోకు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అతనికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం ఖతార్‌ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో ఆడుతున్న రొనాల్డొ తన జట్టు పోర్చుగుల్‌ను జగజ్జేతగా నిలిపే పనిలో ఉన్నాడు. ఇప్పటికే రౌండ్‌ ఆఫ్‌ 16కు అర్హత సాధించిన రొనాల్డొ జట్టు తర్వాతి మ్యాచ్‌లో స్విట్జర్లాండ్‌ను ఢీకొట్టనుంది. బుధవారం (డిసెంబర్‌7) ఈ మ్యాచ్‌ జరగనుంది. కాగా రొనాల్డో గురించి తెలిసిన వారికి అతని సుయ్‌ సెలబ్రేషన్‌ కూడా బాగా తెలిసి ఉంటుంది. చాలామంది అతని సెలబ్రేషన్‌ను అనుసరిస్తున్నాడు. టీమిండియాలో మహ్మద్‌ సిరాజ్ కూడా వికెట్‌ తీసినప్పుడల్లా సుయ్‌ తరహాలో సెలబ్రేట్ చేసుకోవడం మనం చూశాం. అయితే రొనాల్డొకు వీరాభిమాని అయిన ఓ అమ్మాయి మాత్రం కాస్త వినూత్నంగా సెలబ్రేట్‌ చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

లవ్యూ రొనాల్డొ..

అమెరికాకు చెందిన మాజీ గోల్ఫ్‌ ప్లేయర్‌ పెయిజ్‌ స్పిరానక్‌ క్రిస్టియానో రొనాల్డోకు వీరాభిమాని. సోషల్‌ మీడియా ద్వారా అతనిపై ఉన్న అభిమానాన్ని ఎప్పటికప్పుడూ చాటుకుంటూ ఉంటుంది. తాజాగా మరోసారి రొనాల్డోపై ప్రేమను చాటుకుందీ అందాల తార. రొనాల్డొ తరహాలోనే బంతిని గోల్‌ పోస్ట్‌లోకి తరలించాక.. తాను ధరించిన టాప్‌ను తొలగించి సుయ్‌ సెలబ్రేషన్‌ చేసుకుంది. ఆ తర్వాత మోకాళ్లపై కూర్చొని లవ్‌ యూ రొనాల్డో అంటూ నవ్వులు చిందించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా సూపర్‌స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో నేతృత్వంలోని పోర్చుగల్‌ జట్టు ఫిఫా వరల్డ్‌కప్‌లో రౌండ్‌ ఆఫ్‌ 16కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. అయితే గ్రూప్‌ దశలో పోర్చుగల్‌ తమ ఆఖరి మ్యాచ్‌ దక్షిణ కొరియా చేతిలో ఓటమి పాలైంది. అయితే అంతుకుముందే రౌండ్‌ ఆఫ్‌ 16కు అర్హత సాధించడంతో సౌత్‌ కొరియా చేతిలో పరాజయం ఆ జట్టుపై పెద్దగా ప్రభావం చూపలేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..