Wimbledon 2021 Day 4 Highlights: సానియా జోడీ శుభారంభం; ఫెదరర్ ముందంజ.. స్వితోలినా పోరాటానికి తెర!

మహిళల డబుల్స్‌లో భారత స్టార్ ప్లేయర్ సానియా మీర్జా, బెథానీ మాటెక్‌ జోడీ తొలి రౌండ్ లో విజయం సాధించారు. అలాగే పురుషుల సింగిల్స్‌లో స్విట్జర్లాండ్ ప్లేయర్ ఫెదరర్‌, 2వ సీడ్‌ రష్యా ప్లేయర్ మెద్వెదెవ్‌, 4వ సీడ్‌ జర్మనీ ప్లేయర్ జ్వెరెవ్‌ మూడో రౌండ్ లోకి ఎంటరయ్యారు.

Wimbledon 2021 Day 4 Highlights:  సానియా జోడీ శుభారంభం; ఫెదరర్ ముందంజ.. స్వితోలినా పోరాటానికి తెర!
Sania And Mattek

Updated on: Jul 02, 2021 | 6:44 AM

Wimbledon 2021 Day 4 Highlights: మహిళల డబుల్స్‌లో భారత స్టార్ ప్లేయర్ సానియా మీర్జా, బెథానీ మాటెక్‌ జోడీ తొలి రౌండ్ లో విజయం సాధించారు. ఈ జోడీ 7-5, 6-3తో 6వ సీడ్ జోడీ అమెరికా ప్లేయర్ దెసైరే క్రాజిక్‌, చిలీ ప్లేయర్ అలెక్సా గౌరాచి లపై విజయం సాధించింది. తొలి నుంచి ప్రత్యర్థిపై దూకుడు ప్రదర్శించిన సానియా జోడీ.. తిరుగులేని ఆధిపత్యం సాధించారు. నాలుగేళ్ల తర్వాత వింబుల్డన్ టోర్నీలో బరిలోకి దిగింది సానియా. గంటా 28 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్ లో వరుస సెట్లలో ఈ జోడీ విజయం సాధించింది. సానియా కెరీర్‌లో ఇది 121 విజయం. అయితే, సానియా ఈ మ్యాచ్ లో ఒకే ఒక్క ఏస్ సంధించింది. 2017‌లో చివరిసారిగా ఈటోర్నీలో ఆడింది. ఒలింపిక్స్‌కు ముందు జరుగుతున్న వింబుల్డన్ 2021 టోర్నీ ఈ 34 ఏళ్ల హైదరాబాద్ ప్లేయర్ కు చాలా కీలకం. టోక్యో ఒలింపిక్స్ 2020​లో భారత్​తరఫున బరిలోకి దిగనుంది సానియా మీర్జా. ఇప్పటి వరకు 4 ఒలింపిక్స్​ల్లో సానియా పాల్గొంది. మరోవైపు పురుషుల డబుల్స్‌లో భారత ప్లేయర్లు బోపన్న-దివిజ్‌ శరణ్‌ జోడీ 6-7 (6-7), 4-6తో ఫిన్లాండ్ ప్లేయర్ కొంటినెన్‌, ఫ్రాన్స్ ప్లేయర్ రోజర్‌-వాసెలిన్‌ జంట చేతిలో ఓడింది.

వింబుల్డన్‌లో 3వ సీడ్‌ ఉక్రెయిన్ ప్లేయర్ ఎలినా స్వితోలినా రెండో రౌండ్లో ఓడిపోయింది. పోలెండ్‌కు చెందిన లినెట్టె 6-3, 6-4తో స్వితి ఓడిపోయింది. ఇప్పటి వరకు డబ్ల్యూటీఏ టాప్‌-11 ప్లేయర్లు ఈ టోర్నీకి దూరమయ్యారు. మరోవైపు ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఛాంపియన్‌ బార్బరా క్రెజికోవా, టాప్‌ సీడ్‌ బార్టీ తదుపరి రౌండ్ లోకి ప్రవేశించారు. పురుషుల సింగిల్స్‌లో స్విట్జర్లాండ్ ప్లేయర్ ఫెదరర్‌, 2వ సీడ్‌ రష్యా ప్లేయర్ మెద్వెదెవ్‌, 4వ సీడ్‌ జర్మనీ ప్లేయర్ జ్వెరెవ్‌ మూడో రౌండ్ లోకి ఎంటరయ్యారు. 2వ రౌండ్లో ఫెదరర్‌ 7-6 (7-1), 6-1, 6-4తేడాతో ఫ్రాన్స్ ప్లేయర్ గాస్కెట్‌ పై గెలిచి తదుపరి రౌండ్ లోకి ఎంటరయ్యాడు. ఈ మ్యాచ్‌లో ఫెదరర్‌ 9 ఏస్‌లు, 49 విన్నర్లు కొట్టాడు. అలాగే మెద్వెదెవ్‌ 6-4, 6-1, 6-2తో స్పెయిన్ ప్లేయర్ అక్లారెజ్‌ పై, జ్వెరెవ్‌ 7-5, 6-2, 6-3తో అమెరికా ప్లేయర్ సాండ్‌గ్రెన్‌ పై విజయం సాధించారు.

Also Read:

Womens Handball: త్వరలో మహిళల హ్యాండ్‌బాల్ ప్రీమియర్ లీగ్.. ది బ్లూ స్పోర్ట్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఒప్పందం

12 ఏళ్లకే చెస్ లో గ్రాండ్ మాస్టర్ ఎవరా ఆ బుడ్డోడు..?అతి చిన్న వయసులోనే గుర్తింపు..:Abhimanyu Mishra Video.

IND vs ENG: అచ్చం ధోనీలానే.. మిస్టర్ కూల్ కాదిక్కడ.. మిస్ కూల్ షె‎ఫాలీ వర్మ అంటోన్న నెటిజన్లు..!

Loading...
Unable to load recommendations.
Follow Us