Viral Video: చిన్నారి అభిమానానికి సెర్బియా దిగ్గజం ఫిదా… బహుమతిగా ఏమిచ్చాడో తెలుసా?

సెర్బియా టెన్నిస్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్.. అద్భుత ఆటతీరుతో వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఆరోసారి ఛాంపియన్‌గా నిలిచి, మరో ఆశ్యర్యపరిచే పనిచేసి అందరి మనసులను కూడా గెలుచుకున్నాడు.

Viral Video: చిన్నారి అభిమానానికి సెర్బియా దిగ్గజం ఫిదా... బహుమతిగా ఏమిచ్చాడో తెలుసా?
Novak Djokovic

Edited By:

Updated on: Jul 12, 2021 | 8:31 PM

Viral Video: సెర్బియా టెన్నిస్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్.. అద్భుత ఆటతీరుతో వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఆరోసారి ఛాంపియన్‌గా నిలిచి, మరో ఆశ్యర్యపరిచే పనిచేసి అందరి మనసులను కూడా గెలుచుకున్నాడు. అదెలా అంటారా.. ఓ చిన్నారి ఫ్యాన్‌కి తన రాకెట్‌ను బహుమతిగా అందించి, అందరిచే మన్ననలను అందుకున్నాడు. ఈ మేరకు వింబుల్డన్ అకౌంట్లో షేర్ చేసిన ఈ వీడియో తెగ వైరలవుతోంది. అయితే, ఈ వీడియోలో మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు వచ్చిన ఆ చిన్నారి.. మ్యాచ్ జరుగుతున్నంత సేపు జొకోవిచ్ పేరును పలకరిస్తూనే ఉంది. అలాగే తన చేతిలో ఓ పోస్టర్‌ను పట్టుకుని ఉంది. అందులో నోవాక్ జొకోవిచ్ పేరుతో పాటు ప్రపంచ నెంబర్‌1 అని రాసి ఉంది.

ఈ వీడియోను అందమైన చిన్నారి అంటూ సోమవారం జొకోవిచ్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. 3.2 మిలియన్ల వ్యూస్‌తో నెట్టింట్లో దూసుకపోతోంది ఈ వీడియో. 2.32 లక్షల మంది ఈ వీడియోను లైక్‌ చేశారు. మరెంతో మంది తమ కామెంట్లను పంచుకున్నారు. అందులో కొందరు ‘‘ అందుకే జొకోవిచ్‌ వింబుల్డన్‌ నెం1 ఆటగాడు అయ్యాడు.’’ అంటూ కామెంట్‌ చేశారు.

మ్యాచ్ విషయానికి వస్తే.. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్ జొకోవిచ్‌, ప్రపంచ తొమ్మిదవ ర్యాంకర్ బెరెటినితో తలపడ్డాడు. దాదాపు 3 గంటల 24 నిమిషాలపాటు సాగిన ఈ హోరాహోరీ పోరులో 6–7 (4/7), 6–4, 6–4, 6–3 తేడాతో జొకోవిచ్ విజయం సాధించాడు. దీంతో తన కెరీర్‌లో 20వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను దక్కించుకున్నాడు.

Also Read:

India tour of Sri Lanka: ఇట్స్ అఫీషియల్.. ఐదు రోజులు ఆలస్యంగా సిరీస్ రీ-స్టార్ట్.. షెడ్యూల్ ఇదే.!

PM Narendra Modi: హర్లీన్ డియోల్ క్యాచ్‌కు ప్రధాని మోడీ ఫిదా.. అసాధారణమంటూ ప్రశంస

Winbledon 2021: వింబుల్డన్ 2021 జూనియర్ ఛాంపియన్ గా భారత సంతతి కుర్రాడు..! లియాండర్ పేస్ తో మాట్లాడాలని ఉందంటోన్న సమీర్ బెనర్జీ