Viral Video: హైస్కూల్ బాస్కెట్‌బాల్ గేమ్ (Basketball game) జరుగున్న సమయంలో ఒక అంధ బాలిక ( Blind girl) కోసం పాఠశాల మొత్తం ఉత్సాహంగా ఉల్లాసంగా కనిపించిన హృదయాన్ని కదిలించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గుడ్ న్యూస్ మూవ్‌మెంట్ ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియో షేర్ చేయబడింది. ఇప్పటి వరకూ ఇప్పటివరకు 13.8 మిలియన్లకు పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది. ఈ దృశ్యం అమెరికాలోని మిచిగాన్‌లోని జీలాండ్ ఈస్ట్ హైస్కూల్‌లో కెమెరాకు చిక్కింది. అవును ఆ బాలిక కాన్ఫిడెన్స్‌కి అంధత్వం సిగ్గుపడింది.. తన ఆటతీరుకి విధిసైతం తలవంచింది. కళ్లు కనిపించకపోయినా తనలోని ప్రతిభతో సత్తా చాటింది ఓ బాలిక. సాధారణంగా కళ్లు కనిపించే వారికే బాస్కెట్‌బాల్ ఆట కష్టమైంది. ఎంతో అనుభవజ్ఞులు.. ప్రాక్టీస్ ఉన్నవారు కూడా ఒక్కోసారి రిమ్‌లో బాల్ వేయలేరు. ఎన్నోసార్లు విఫలమవుతుంటారు. కానీ ఓ అంధ బాలిక ఒకే అటెంప్ట్‌లో అద్భుతమైన స్కోర్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ వీడియో ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది.
ఓ మైదానంలో ఇంటర్ స్కూల్ గేమ్స్ జరుగుతున్నాయి. బాస్కెట్‌బాల్ మ్యాచ్ చూసేందుకు స్టేడియంలో ప్రేక్షకులు కిక్కిరిసిపోయారు. జూల్స్ హూగ్‌లాండ్ అనే అంధ బాలిక బాల్‌పట్టుకుని రెడీగా ఉంది. బాస్కెట్ రిమ్ వెనుకాల ఓ టీచర్ ఓ రాడ్డుతో శబ్దం చేస్తూ ఉంది. ఆ శబ్దం ఆధారంగా జూల్స్ ఒకే అటెంప్ట్‌లో స్కోర్ చేసింది. దాంతో అప్పటిదాకా సైలెంట్‌గా ఎంతో ఉత్కంఠగా చూస్తున్న ప్రేక్షకులంతా ఒక్కసారిగా నిల్చొని చప్పుట్లతో హర్షద్వానాలు చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో చూస్తున్న నెటిజన్లు బాలిక టాలెంట్‌కు ముగ్దులవుతున్నారు. తమ కామెంట్లతో బాలికను బ్లెస్ చేస్తున్నారు.
Also Read: Black box: చైనా విమాన ప్రమాద ఘటనలో మరో బ్లాక్ బాక్స్ లభ్యం.. కీలక వివరాలు తెలిసే అవకాశం
Australia: ఇది మాములు బుక్ కాదు.. మగవాళ్లని అలా క్యూలో నిలబెట్టవచ్చు..