Floyd Mayweather: అమెరికన్ బాక్సర్ ఓ ఫేక్ ఫైట్‌తో ఒక్క రోజులో ఎంత సంపాదించాడో తెలుసా…!

|

Jun 30, 2021 | 9:37 AM

ఓ ఫేక్ ఫైట్ తో ఏకంగా 100 మిలియన్లు సాధించాడో అమెరికా దిగ్గజ బాక్సర్. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

Floyd Mayweather: అమెరికన్ బాక్సర్ ఓ ఫేక్ ఫైట్‌తో ఒక్క రోజులో ఎంత సంపాదించాడో తెలుసా...!
Floyd Mayweather
Follow us on

Floyd Mayweather: ఓ ఫేక్ ఫైట్ తో ఏకంగా 100 మిలియన్లు సాధించాడో అమెరికా దిగ్గజ బాక్సర్. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అమెరికాకు చెందిన బాక్సర్ ఫ్లయిడ్ మెవెదర్.. ఓ ఫేక్ ఫైట్ తో ఒక్క రోజులో 100 మిలియన్ డాలర్లు.. మన కరెన్సీలో చెప్పాలంటే దాదాపు రూ.742 కోట్లను ఒక్క రోజులోనే ఆర్జించాడు. టీమిండియా విరాట్ కోహ్లీ ఏడాదికి దాదాపు రూ. 192 కోట్లు సంపాదిస్తున్నాడు. ఈ చొప్పున కోహ్లీ నాలుగేళ్ల సంపాదనను ఈ అమెరికా బాక్సర్ కేవలం ఒక్కరోజులోనే సంపాదించాడు. అసలు విషయం ఏంటంటే.. జూన్ మొదటి వారంలో లోగన్ పాల్ అనే యూట్యూబర్‌తో ఆ అమెరికా బాక్సర్ ఫ్లయిడ్ మెవెదర్ తలపడ్డాడు. ఆ మ్యాచ్ ద్వారానే ఇంత సంపాదించినట్లు పేర్కొని అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఇదంతా ఓ ఫేక్‌ ఫైట్ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రొఫెషనల్ బాక్సర్ అయిన మెవెదర్‌.. ఈ యూట్యూబర్‌తో ఆరు రౌండ్లు తలపడ్డాడు. అయితే ఈ ఫైట్‌లో యూట్యూబర్‌పై ఒక్క పంచ్‌ కూడా చేయలేదంట. ఈ మ్యాచ్‌పై చాలా సందేహాలు, విమర్శలు కూడా వస్తున్నాయి. ఎన్ని అవకాశాలొచ్చినా పంచ్‌లు విసరకపోవడం ఏంటంటూ ఫ్యాన్స్‌ కామెంట్లు చేశారు. అయితే ఇదంతా డబ్బు కోసమే చేశారంటూ మరికొందరు అంటున్నారు. మరో విశేషం ఏంటంటే.. ఈ మ్యాచ్‌లో మెవెదర్ ఓడిపోయాడు. అయినా అతని ఖాతాలో రూ. 742 కోట్లు వచ్చి చేరాయి. ప్రస్తుతం అతని ఆస్తుల విలువ రూ. 1.2 బిలియన్లకు చేరుకుందని సమాచారం.

మరోవైపు మెవెదర్ తన కెరీర్‌లో ఒక్క మ్యాచ్‌లో కూడా ఇప్పటి వరకు ఓటమిపాలు కాలేదు. ఇప్పటి వరకు 50 మ్యాచ్‌ల్లో తలపడిన మెవెదర్.. అన్నింటిలోనూ గెలిచాడు. హోలీఫీల్డ్‌ లాంటి స్టార్‌ బాక్సర్లను సైతం ఓడగొట్టాడు. బాక్సింగ్‌ లో ఎదురులేని వీరుడిగా మారాడు. ఈ పేరుతోనే ఎక్కువ డబ్బును సంపాదిస్తున్నాడు. 2017లో బాక్సింగ్ నుంచి రిటైర్‌ అవుతున్నట్లు ప్రకటించాడు. మెవెదర్ వద్ద కార్లు, వాచీలు, జ్యువెలరీ లాంటి ఖరీదైనవి ఎన్నో ఉన్నాయి. బుగాటి, లంబొర్గిని, రోల్స్ రాయస్ వంటి కార్లు అతడి చెంత చేరాయి. రూ. 350 కోట్లతో వరల్డ్‌ క్లాస్‌ జెట్‌ ఫ్లైట్‌ని కొనుగోలు చేసి ఆశ్చర్యపరిచాడు.

Also Read:

Wimbledon 2021 Day 2 Highlights: రెండో రౌండ్‌కు చేరిన ఫెదరర్‌, వీనస్.. గాయంతో తప్పుకున్న సెరెనా విలియమ్స్‌!

ENG vs SL: మారని లంక జాతకం.. తొలి వన్డేలో ఘోర పరాజయం