Thomas Cup Final 2022, India vs Indonesia Badminton Match LIVE Score and Updates in Telugu: బ్యాడ్మింటన్‌లో భారత జట్టు చరిత్ర సృష్టించింది. గత 73 ఏళ్లుగా ఊరిస్తున్న ప్రతిష్ఠాత్మక థామస్ కప్‌ను టీమిండియా కైవసం చేసుకుంది. దీంతో బ్యాంకాక్ వేదికగా మువ్వన్నెల పతాకం రెపరెపలాడింది. 73 ఏళ్ల టోర్నీ చరిత్రలో భారత జట్టు ఫైనల్‌కు చేరడం ఇదే తొలిసారి. 10 మంది భారత బ్యాడ్మింటన్ ఆటగాళ్లు ఈ బాధ్యతను తమ భుజస్కందాలపై వేసుకుని కోర్టులోకి వచ్చి త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారు. టోర్నీకి ముందు, టీమ్ ఈవెంట్‌లోని ఏకైక టోర్నమెంట్‌లో భారత్ ఈ చరిత్ర సృష్టిస్తుందని ఎవరూ ఊహించలేదు. ఉబెర్ కప్ క్వార్టర్-ఫైనల్ నుంచి మహిళల జట్టు నిష్క్రమించింది. కానీ, పురుషుల జట్టు మాత్రం ఆశ్చర్యపరిచింది.
ఫైనల్‌కు చేరుకోవడానికి ముందు భారత్ గ్రూప్ రౌండ్‌లో మూడు మ్యాచ్‌లు ఆడింది. ఇక్కడ రెండు మ్యాచ్‌లు క్లీన్‌స్వీప్‌తో గెలిచింది. చైనీస్ తైపీ చేతిలో ఓడిపోయినప్పటికీ.. టోర్నీలో భారత్‌కు ఏకైక ఓటమిగా నిలిచింది. క్వార్టర్స్‌లో మలేషియాను 3-2తో ఓడించింది. అదే సమయంలో సెమీస్‌లో డెన్మార్క్‌తో తలపడిన భారత్.. మరో ఉత్కంఠ విజయం సాధించి చరిత్ర సృష్టించింది.
చివరి గేమ్‌లో శ్రీకాంత్ 19-18తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అయితే క్రిస్టీ మళ్లీ స్కోరును సమం చేశారు. దీంతో స్కోరు 21-21తో సమమైంది. ఆపై శ్రీకాంత్ రెండు పాయింట్లు సాధించి గేమ్‌ను కైవసం చేసుకున్నాడు. దీంతో ప్రతిష్ఠాత్మక థామస్ కప్ టీమిండియా కైవసం చేసుకుంది.
రెండో గేమ్‌లోనూ శ్రీకాంత్ అద్భుతంగా ఆడుతున్నాడు. క్రిస్టీపై ఒత్తిడి తెస్తున్నాడు. ప్రస్తుతం 2-1తో ఆధిక్యంలోకి వెళ్లాడు.
మూడో మ్యాచ్‌లో తొలి గేమ్‌లో శ్రీకాంత్ విజయం సాధించాడు. ఈ గేమ్‌ను 21-15 తేడాతో గెలుచుకున్నాడు. ఇప్పుడు రెండో గేమ్‌ను గెలిస్తే మ్యాచ్‌లో కూడా గెలిచి భారత్‌కు 3-0తో చారిత్రాత్మక విజయం సొంతమవుతుంది.
థామస్ కప్ బ్యాడ్మింటన్ డబుల్స్ ఫైనల్‌లో ఇండోనేషియాపై భారత్ ఘన విజయం సాధించింది. ఇండోనేషియా జోడి అసాన్, సంజయ జోడిపై, భారత జోడి సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడి గెలుపొందింది. 18-21, 23-21, 21-19 తేడాతో విక్టరీ కొట్టేసింది.
పురుషుల డబుల్స్ మ్యాచ్‌లో భారత్ వరుసగా రెండు గేమ్‌లు గెలిచిన తర్వాత మొదటి గేమ్‌లో గెలిచి ఇండోనేషియాను ఓడించింది. ఈ మ్యాచ్‌లో భారత్ 8-21, 23-21, 21-19 తేడాతో విజయం సాధించింది . భారత్ ఇప్పుడు చారిత్రాత్మక విజయానికి ఒక్క అడుగు దూరంలో ఉంది.
నిర్ణయాత్మక గేమ్‌లో భారత్, ఇండోనేషియా జోడీ పోటాపోటీగా తలపడినా ఫైనల్‌గా భారత జోడీనే విజయం సాధించింది. ఈ గేమ్‌ను భారత్ 21-19 తేడాతో గెలిచి, బి మ్యాచ్‌ని గెలుచుకుంది.
నిర్ణయాత్మకమైన మూడో గేమ్ అద్భుతంగా ప్రారంభమైంది. ఇండోనేషియా వరుసగా మూడు పాయింట్లతో భారత్‌పై 12-11 ఆధిక్యంలో నిలిచింది. భారత జోడీ కాస్త వెనుకబడినట్లు కనిపిస్తోంది.
తొలి గేమ్‌లో ఇండోనేషియా ఆధిక్యం చూపగా, రెండో గేమ్‌లో భారత జోడీ తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించింది. దీంతో రెండో గేమ్‌ను 23-21తేడాతో గెలుచుకుంది. ఇక మూడో గేమ్‌లో ఎవరు విజయం సాధిస్తారో చూడాలి.
ఒక తీవ్రమైన ర్యాలీ తర్వాత భారత జోడీ తిరిగి రావడానికి ప్రయత్నిస్తుంది. ప్రస్తుతం రెండో గేమ్‌లో 11-6 తేడాతో ముందజంలో నిలిచారు.
హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో ఇండోనేషియా జోడీ మహ్మద్ అహ్సన్/కెవిన్ సుకముల్జో 19-21 పాయింట్లతో తొలి గేమ్‌ను గెలుచుకుంది. సాత్విక్‌సాయిరాజ్ రాంకిరెడ్డి/చిరాగ్ శెట్టి రెండో గేమ్‌లో తిరిగి పుంజుకుంటే భారత్ విజయానికి మరో అంకం మాత్రమే మిగిలిఉంటుంది.
భారత్ రెండో గేమ్‌లో 1-0 ఆధిక్యంలో బరిలోకి దిగనుంది. లక్ష్య సేన్ వీరోచిత పోరాటంతో తొలి మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. సాత్విక్ సాయిరాం, చిరాగ్ శెట్టి రెండో గేమ్‌లో పురుషుల డబుల్స్‌లో జరిగే మొదటి మ్యాచ్‌లో మహ్మద్ అహ్సన్, కెవిన్ సుకముల్జోతో తలపడుతున్నారు.
లక్ష్య సేన్ సాధించాడు. వాట్ ఏ కంబ్యాక్ ఫైట్..! రెండో గేమ్‌లో 13 పాయింట్ల తేడాతో సేన్ తన సత్తాచాటాడు. మ్యాచ్ పాయింట్‌కి వచ్చేసరికి, సేన్ కోర్ట్‌కు కుడివైపున ఉన్న నెట్ గేమ్‌లో గింటింగ్‌ను ఓడించాడు. దీంతో మొత్తం ఐదు గేమ్‌లలో భారత్ 1-0తేడాతో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
ఇద్దరు ఆటగాళ్లు మూడో గేమ్ గెలిచేందుకు హోరాహోరీగా తలపడుతున్నారు. నువ్వానేనా అనే రీతిలో మూడో గేమ్ సాగుతోంది.
లక్ష్య సేన్ రెండో గేమ్‌లో తిరిగి పుంజుకున్నాడు. తనదైన స్టైల్‌తో గేమ్‌ను 1-1 సమం చేశాడు. రెండో గేమ్‌లో 21-17తో ఆధిక్యం సాధించాడు.
లక్ష్య సేన్ రెండో గేమ్‌లో సత్తా చాటుతున్నాడు. విరామం తర్వాత దూకుడైన ఆటతో ఆంథోనిపై ఆధిక్యంతో దూసుకెళ్తున్నాడు. అలాగే ఇండోనేషియా ఆటగాడు కూడా గట్టిపోటీని అందిస్తున్నాడు. ఇద్దరి మధ్య స్వల్ప తేడానే ఉండడంతో రెండో గేమ్ హోరాహోరీగా సాగుతోంది.
లక్ష్య సేన్ రెండో గేమ్‌లో సత్తా చాటుతున్నాడు. విరామం తర్వాత దూకుడైన ఆటతో ఆంథోనిపై ఆధిక్యంతో దూసుకెళ్తున్నాడు.
17 నిమిషాలపాటు సాగిన తొలి గేమ్‌లో ఆంథోనీ గింటింగ్ పూర్తి ఆధిపత్యంతో దూసుకెళ్లాడు. 21-8తో మొదటి గేమ్‌ను సొంతం చేసుకున్నాడు.
లక్ష్య సేన్ తప్పిపోయిన అవకాశాన్ని చేజార్చుకున్నాడు. వరుస పాయింట్లతో ఆంథోని లక్ష్యసేన్‌పై సత్తా చాటుతున్నాడు. ప్రస్తుతం ఇద్దరి మధ్య భారీ తేడా కొనసాగుతోంది.
బ్యాటిల్ నెట్స్‌లో ఇరువురు ఆటగాళ్ల ఆధిక్యం కోసం తెగ పోరాడుతున్నారు. లక్ష్య సేన్ ప్రస్తుతం క్యాచ్ అప్ ప్లే చేస్తున్నాడు. టోక్యో ఒలింపిక్ కాంస్య పతక విజేత అయిన జింటింగ్ మంచి షాట్‌లతో ఆధిక్యంలోకి దూసుకెళ్తున్నాడు.
ఆంథోనీ సినీసుక గింటింగ్ వర్సెస్ లక్ష్య సేన్ గతంలో ఒకసారి తలపడ్డారు. ఆ మ్యాచ్‌లో భారత్ గెలిచింది. వాస్తవానికి, ఈ ఆటగాళ్ళు పోరాడిన రెండు గేమ్‌లలో గింటింగ్ కేవలం 16 పాయింట్లను మాత్రమే గెలుచుకున్నాడు.
ఆ మ్యాచ్‌లో సేన్ 21-7, 21-9తో గింటింగ్‌ను ఓడించాడు!
ఈ టోర్నీలో భారత్ ప్రయాణాన్ని పరిశీలిస్తే.. జర్మనీ, కెనడా, తైవాన్, మలేషియా, డెన్మార్క్‌లను ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. కాగా, ఇండోనేషియా టీం కొరియా, థాయ్‌లాండ్, సింగపూర్, చైనా, జపాన్‌లను ఓడించింది.
యువ ఆటగాడు లక్ష్యసేన్, అనుభవజ్ఞులైన ఆటగాళ్లు హెచ్‌ఎస్ ప్రణయ్, కిదాంబి శ్రీకాంత్‌లు భారత్ విజయానికి కారణమయ్యారు. ఈ ముగ్గురూ తమ అత్యుత్తమ ఆటను ఆడితే ఎవరినైనా ఓడించే సత్తా వారికి ఉంటుంది. ఇటువంటి పరిస్థితిలో, ఈ ముగ్గురి మ్యాచ్‌లపై చాలా ఆధారపడి ఉంటుంది.
The last hurdle. The big one. Let’s do this, TOGETHER.
This is INDIA. ?? #ThomasAndUberCup2022 #TUC2022 #BWF pic.twitter.com/bvSU8XrsrQ
— Lakshya Sen (@lakshya_sen) May 14, 2022
?-??? ??
All the best boys, let’s do this! ?
?: @VootSelect & @Sports18#TUC2022#ThomasCup2022#ThomasUberCups#IndiaontheRise#Badminton pic.twitter.com/DT4pM9vBeK
— BAI Media (@BAI_Media) May 15, 2022
మ్యాచ్ నం.1: ఆంథోనీ సినీసుక గింటింగ్ vs లక్ష్య సేన్
మ్యాచ్ నం. 2: మహ్మద్ అహ్సన్/ కెవిన్ సంజయ సుక్ముల్జో vs సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి/ చిరాగ్ శెట్టి
మ్యాచ్ నం. 3: జోనటన్ క్రిస్టీ vs కిడ్మాబి శ్రీకాంత్
మ్యాచ్ నం. 4: ఫజర్ అల్ఫియన్ / ముహమ్మద్ రియాన్ ఆర్డియాంటో vs ఎంఆర్ అర్జున్ / ధ్రువ్ కపిల
మ్యాచ్ నం. 5: షెసర్ హిరెన్ రుస్తావిటో vs హెచ్ఎస్ ప్రణయ్
మొత్త 5 మ్యాచ్‌ల్లో తొలి 3 మ్యాచ్‌లు గెలిచిన జట్టు టైటిల్‌ను కైవసం చేసుకుంటుంది. సెమీ-ఫైనల్‌లో, చివరి గేమ్‌లో చివరి రెండు సెట్లలో భారత్‌ను కాపాడిన హెచ్‌ఎస్ ప్రణయ్ భారత్‌కు ఫైనల్‌లో ఆడే అవకాశాన్ని కల్పించాడు.
థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లోని ఇంపాక్ట్ అరేనాలో భారత్ వర్సెస్ ఇండోనేషియా మధ్య జరగనున్న థామస్ కప్ ఫైనల్ ప్రత్యక్ష ప్రసారానికి స్వాగతం. లైవ్ మ్యాచ్‌కు సంబంధించిన తాజా అప్‌డేట్స్ అన్ని ఇక్కడ చూడొచ్చు.