Neeraj Chopra: గోల్డెన్ నీరజ్ చోప్రా.. అథ్లెటిక్స్‌లో భారత్‌కు ఇదో భారీ అచీవ్‌మెంట్: కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్..

|

Aug 28, 2023 | 10:47 AM

Union Sports Minister Anurag Thakur: ఈ ఏడాది మేలో జరిగిన దోహా డైమండ్ లీగ్‌లో నీరజ్ తన సీజన్‌లో అత్యుత్తమ 88.67 మీటర్లను సాధించాడు. 25 ఏళ్ల నీరజ్ చోప్రా ఒలంపిక్స్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడల్లో బంగారు పతకాలు సాధించడమే కాకుండా డైమండ్ లీగ్ ఛాంపియన్‌గా నిలిచాడు. నీరజ్ చోప్రా ఈ ఛాంపియన్‌షిప్ చివరి సీజన్‌లో చారిత్రాత్మక రజత పతకాన్ని అందించాడు. ఒరెగాన్‌లో జరిగిన పోటీలో నీరజ్ చోప్రా 88.39 మీటర్లు జావెలిన్ విసిరాడు.

Neeraj Chopra: గోల్డెన్ నీరజ్ చోప్రా.. అథ్లెటిక్స్‌లో భారత్‌కు ఇదో భారీ అచీవ్‌మెంట్: కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్..
Neeraj Chopra Anurag Thakur
Follow us on

World Athletics Championship 2023: ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఆదివారం అర్థరాత్రి చరిత్ర సృష్టించాడు. టోర్నీ ఫైనల్‌లో 88.17 మీటర్ల జావెలిన్ త్రో విసిరి స్వర్ణం సాధించాడు. ఈ ఛాంపియన్‌షిప్ ఆగస్టు 19 నుంచి 27 వరకు హంగేరిలోని బుడాపెస్ట్‌లో జరిగింది. 25 ఏళ్ల నీరజ్ ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించిన తొలి భారతీయ అథ్లెట్‌గా నిలిచాడు. గతేడాది యూజీన్‌లో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకాన్ని సాధించగా, ఈసారి దానిని స్వర్ణంగా మార్చుకున్నాడు.

పాకిస్థాన్‌కు చెందిన అర్షద్ నదీమ్ రజతం సాధించాడు. అతను 87.82 మీటర్ల అత్యుత్తమ ప్రయత్నం చేశాడు. ఈ ఛాంపియన్‌షిప్ 1983 నుంచి జరుగుతోంది. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు ఇది మూడో పతకం.

ఇవి కూడా చదవండి

నీరజ్ చారిత్రాత్మక విజయం సాధించినందుకు కేంద్ర క్రీడల శాఖా మంత్రి అనురాగ్ ఠాకూర్ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ‘ ప్రపంచ అథ్లెట్ ఛాంపియన్ 2023లో బంగారు పతకం సాధించినందుకు నీరజ్ చోప్రాకు అభినందనలు. నీరజ్ ఇక్కడే కాదు, చాలా ఛాంపియన్‌షిప్స్‌లో గోల్ మెడల్స్ ఒడిసి పట్టాడు. భారత్‌కు అథ్లెటిక్స్‌లో ఇదో పెద్ద అచీవ్‌మెంట్’ అంటూ ప్రశంసల వర్షం కురిపించారు.

అనురాగ్ ఠాకూర్ చిట్ చాట్..

క్వాలిఫైయింగ్ రౌండ్‌లో ఈ సీజన్‌లోనే అత్యుత్తమ జావెలిన్ త్రో..

నీరజ్ క్వాలిఫైయింగ్ రౌండ్‌లో తన మొదటి ప్రయత్నంలో 88.77 మీటర్లు విసిరాడు. ఇది సీజన్‌లో అతని అత్యుత్తమ స్కోరు. దీంతో పాటు పారిస్‌ ఒలింపిక్స్‌ టిక్కెట్‌ కూడా దక్కించుకున్నాడు.

ఈ ఏడాది మేలో జరిగిన దోహా డైమండ్ లీగ్‌లో నీరజ్ తన సీజన్‌లో అత్యుత్తమ 88.67 మీటర్లను సాధించాడు. 25 ఏళ్ల నీరజ్ చోప్రా ఒలంపిక్స్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడల్లో బంగారు పతకాలు సాధించడమే కాకుండా డైమండ్ లీగ్ ఛాంపియన్‌గా నిలిచాడు.

గతేడాది రజతం సాధించిన ఈవెంట్‌లో గోల్డ్ పట్టేసిన నీరజ్..

నీరజ్ చోప్రా ఈ ఛాంపియన్‌షిప్ చివరి సీజన్‌లో చారిత్రాత్మక రజత పతకాన్ని అందించాడు. ఒరెగాన్‌లో జరిగిన పోటీలో నీరజ్ చోప్రా 88.39 మీటర్లు జావెలిన్ విసిరాడు. పతకం కోసం భారత్‌ 19 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..