Tokyo Olympics 2021: భారత తొలి స్విమ్మర్‌గా చరిత్ర సృష్టించిన సాజన్ ప్రకాశ్

| Edited By: Anil kumar poka

Jul 01, 2021 | 7:22 PM

టోక్యో ఒలింపిక్స్ 2021 జులై నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 8 వరకు జరగనున్న ఈ ఒలింపిక్స్‌లో భారత్‌ నుంచి దాదాపు 100 మందికిపైగా అథ్లెట్లు పాల్గొనబోతున్నారు. తాజాగా భారత స్టార్ సిమ్మర్ సాజన్ ప్రకాశ్ ఈ పోటీలకు ఎంపికయ్యాడు.

Tokyo Olympics 2021: భారత తొలి స్విమ్మర్‌గా చరిత్ర సృష్టించిన సాజన్ ప్రకాశ్
Sajan Prakash
Follow us on

Tokyo Olympics 2021: టోక్యో ఒలింపిక్స్ 2021 జులై 23 నుంచి జరగనున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 8 వరకు జరగనున్న ఈ ఒలింపిక్స్‌లో భారత్‌ నుంచి దాదాపు 100 మందికిపైగా అథ్లెట్లు పాల్గొనబోతున్నారు. తాజాగా భారత స్టార్ సిమ్మర్ సాజన్ ప్రకాశ్ ఈ పోటీలకు ఎంపికయ్యాడు. భారత్‌ నుంచి ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత సాధించిన తొలి ఈతగాడిగా చరిత్ర సృష్టించాడు. ఒలింపిక్స్ పోటీలకు అర్హత సాధించాలంటే ‘ఏ’ ప్రమాణం అందుకోవాలి. శనివారం ఇటలీలోని రోమ్‌లో జరిగిన ఈత పోటీల్లో ఈ ప్రమాణం సాధించి టోక్యో ఒలింపిక్స్ అర్హత సాధించాడు. సెట్‌ కోలి ట్రోఫీలో జరిగిన 200 మీటర్ల సాజన్ ప్రకాశ్… బటర్‌ఫ్లై విభాగంలో ఒక నిమిషం 56.38 సెకన్లలో చేరుకున్నాడు. ఒలింపిక్‌ పోటీలకు అర్హత సాధించాలంటే ఒక నిమిషం 56.48 సెకన్ల కంటే ముందే లక్ష్యాన్ని చేరుకోవాలి. దీంతో సాజన్ అంతకంటే ముందే లక్ష్యాన్ని చేరుకుకుని జాతీయ రికార్డును తిరగరాశాడు. అంతకుముందు(ఒక నిమిషం 56.96 సెకన్లు) కూడా అతని పేరుమీదే జాతీయ రికార్డు ఉంది. దీన్ని తాజాగా తన రికార్డును తనే బీట్ చేశాడు.

బెల్‌గ్రేడ్‌ ట్రోఫీ స్విమ్మింగ్‌ టోర్నీలో గత వారం పాల్గన్న సాజన్ ప్రకాశ్.. ఒక నిమిషం 56.96 సెకన్లలో పోటీని ముగించి తొలిసారి జాతీయ రికార్డును నమోదు చేశాడు. కాగా, ఒలింపిక్స్‌లో సాజన్ పోటీపడటం ఇది రెండోసారి. 2016 రియో ఒలింపిక్స్‌లోనూ పాల్గొన్నాడు. ఈ రికార్డుతో సాజన్ ప్రకాశ్‌ డైరెక్టుగా ఒలింపిక్స్ పోటీలకు అర్హత సాధించాడు. దీంతో శ్రీహరి నటరాజ్‌కు టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశం మిస్ అయింది. భారత్ నుంచి సాజన్‌ ప్రకాశ్‌తో పాటు మాన పటేల్‌ కూడా టోక్యో ఒలింపిక్స్ లో ఆడనుంది. యూనివర్సిటీ కోటా కింద అన్ని దేశాలు ఇద్దరిని నేరుగా ఒలింపిక్స్ కు ఎంపియ చేయవచ్చు. ఇందులో ఓ పురుషుడితోపాటు మహిళను కూడా ఎంచుకోవాల్సి ఉంటుంది. దీంతో ఈ కోటా కిందే మాన పటేల్‌ను ఒలింపిక్స్ కు భారత్ ఎంపిక చేసింది.

టోక్యో ఒలింపిక్స్‌లో ప్రేక్షకులక అనుమతిని ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రతిరోజు 10,000 మందిని మాత్రమే క్రీడలకు అనుమతిని ఇస్తారు. అయితే, క్రీడాకారలుతో పాటు ప్రేక్షకులకు కఠిన నిబంధనలు అమలు చేయనున్నట్లు ఇదివరకే ఒలింపిక్ నిర్వాహకులు తెలియజేశారు. టెంపరేచర్ కూడా చెక్ చేయనున్నారు. అలాగే తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, మరో ప్రేక్షకుడితో కలవడం, కేటాయించిన సీటులోనే కూర్చోవాలని ఆదేశించింది. వీటితోపాటు క్రీడాకారులను ఆటోగ్రాఫ్‌లు తీసుకోకూడదని కోరింది. మద్యపానం నిషేధంతోపాటు ఒలింపిక్ విలేజ్‌లో ఎక్కడా తిరగొద్దని సూచించింది.

Also Read:

Nationals Awards 2021: ఖేల్‌రత్న అవార్డుకు శ్రీజేశ్‌, దీపిక పేర్లు; హాకీ ఇండియా సిఫార్సులు

INDW vs ENGW 1st ODI Preview: ఇంగ్లండ్‌తో భారత మహిళల పోరు; నేడు బ్రిస్టల్‌ మొదటి వన్డే

WI vs SA : మొదటి టీ 20 లో ఇరగదీసిన లూయిస్, గేల్..! 15 ఓవర్లలో 15 సిక్స్‌లు.. ఫలితంగా వెస్టీండీస్ ఘన విజయం..