Swiss Open, Kathar Open Tennis: స్విస్‌ ఓపెన్‌లో పీవీ సింధు, శ్రీకాంత్‌ శుభారాంభం.. ఖతార్ టోర్నీలో సానియా హవా..

|

Mar 04, 2021 | 3:19 PM

స్విస్‌ ఓపెన్‌లో భారత ఏస్‌ షట్లర్లు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్‌ శుభారంభం చేశారు. డబుల్స్‌లో సాత్విక్‌, అశ్విని జోడీలు ఇప్పటికే ప్రీ క్వార్టర్స్‌కు దూసుకెళ్లగా.. హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ తొలి రౌండ్‌లోనే ఓడిపోయి ఇంటి ముఖం పట్టాడు. మహిళల సింగిల్స్‌లో బుధవారం జరిగిన తొలి రౌండ్‌ మ్యాచ్‌లో..

Swiss Open, Kathar Open Tennis: స్విస్‌ ఓపెన్‌లో పీవీ సింధు, శ్రీకాంత్‌ శుభారాంభం.. ఖతార్ టోర్నీలో సానియా హవా..
Follow us on

Swiss Open, Kathar Open Tennis: కరోనా కారణంగా క్రీడలు కూడా ఆగిపోయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ క్రీడలు మొదలవుతున్నాయి. ఇప్పటికే క్రికెట్‌ మ్యచ్‌లకు ప్రేక్షకులను కూడా అనుమతిస్తోన్న వేళ.. అంతర్జాతీయంగా కూడా పలు టోర్నీలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే స్విస్‌ ఓపెన్‌తో పాటు ఖతార్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నీలు ప్రారంభమయ్యాయి. ఈ క్రీడల్లో భారత ప్లేయర్స్‌ తమ హవాను కొనసాగిస్తున్నారు.


తాజాగా స్విస్‌ ఓపెన్‌లో భారత ఏస్‌ షట్లర్లు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్‌ శుభారంభం చేశారు. డబుల్స్‌లో సాత్విక్‌, అశ్విని జోడీలు ఇప్పటికే ప్రీ క్వార్టర్స్‌కు దూసుకెళ్లగా.. హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ తొలి రౌండ్‌లోనే ఓడిపోయి ఇంటి ముఖం పట్టాడు. మహిళల సింగిల్స్‌లో బుధవారం జరిగిన తొలి రౌండ్‌ మ్యాచ్‌లో పీవి సింధు.. 21-16, 21-19తో టర్కీకి చెందిన నెస్లిహన్‌ యజిట్‌పై వరుస గేముల్లో గెలుపొందింది. ఇక పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్‌ 18-21, 21-18, 21-11తో సమీర్‌ వర్మపై నెగ్గాడు. ఇక స్విస్‌ దేశానికి క్రిస్టిమయెర్‌పై సౌరభ్‌ వర్మ 21-19, 21-18తో గెలుపొందాడు. అజయ్‌ జయరామ్‌ 21-12, 21-13తో థాయ్‌లాండ్‌ ప్లేయర్‌ సిత్తికోమ్‌ తమాసిస్‌పై గెలిచారు. ఇదిలా ఉంటే హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ మాత్రం నెదర్లాండ్స్‌కు చెందిన మార్క్‌ కలిజౌ ప్లేయర్‌ చేతిలో ఓటమిని చవి చూశాడు. ప్రణయ్‌ 19-21, 21-9, 17-21తో ఓడిపోయాడు.


ఇక దోహలో జరుగుతోన్న ఖతార్‌ ఓపెన్‌ టెన్నిస్ టోర్నీలో భారత ఏస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా సెమీఫైనల్లోకి ప్రవేశించింది. బుధవారం జరిగిన మహిళల డబుల్స్‌ క్వార్టర్స్‌లో సానియా-ఆండ్రేజా క్లెపాక్‌ (స్లోవేనియా) జోడీ 6-2, 6-0తో రష్యాకు చెందిన నాలుగో సీడ్‌ అన్నా బ్లికోవా – కెనడాకు ప్లేయర్‌ గాబ్రియేలా డబ్రోస్కీ ద్వయంపై గెలుపొందింది. ఇక సెమీస్‌లో టాప్‌ సీడ్‌ బార్బరా క్రెజికోవా-క్యాటరీనా సినియాకోవా ద్వయంతో తలపడనుంది.

Also Read: India vs England 4th Test Live: నెమ్మదిగా ఆడుతున్న ఇంగ్లీష్ ఆటగాళ్లు.. టీ టైమ్ వరకు ఇంగ్లాండ్ స్కోర్ 144/5

India vs England: నాలుగో టెస్ట్‌లో విరాట్ కోహ్లి – బెన్ స్టోక్స్ మధ్య గొడవ.. వీడియో వైరల్ Video

మీ వల్లే ఈ జర్నీ బ్యూటిఫుల్‌గా సాగింది..మరో రికార్డు సొంతం చేసుకున్న క్రికెటర్ కోహ్లీ : Virat Kohli New Record Video