PM Modi: కష్టపడితే ఏదైనా సాధించవచ్చు.. ప్రధాని మోదీని కలిసిన థామస్‌ కప్‌ ఛాంపియన్లు

|

May 22, 2022 | 3:13 PM

థామస్‌ కప్‌ సాధించి భారత బ్యాడ్మింటన్‌ చరిత్రలో సువర్ణాధ్యాయం లిఖించిన బ్యాడ్మింటన్‌ బృందం ప్రధాని నరేంద్ర మోదీతో భేటి అయ్యింది. ఆటగాళ్లతో పాటు ప్రధాన కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ ఉన్నారు.

PM Modi: కష్టపడితే ఏదైనా సాధించవచ్చు.. ప్రధాని మోదీని కలిసిన థామస్‌ కప్‌ ఛాంపియన్లు
PM Modi interacted with thomas cup champions
Follow us on

కష్టపడితే ఏదైనా సాధించవచ్చన్న స్ఫూర్తిని ఈ భారత జట్టు కల్పించిందని మోదీ(PM Modi) అన్నారు. థామస్‌ కప్‌(Thomas Cup) సాధించి భారత బ్యాడ్మింటన్‌ చరిత్రలో సువర్ణాధ్యాయం లిఖించిన బ్యాడ్మింటన్‌ బృందం ప్రధాని నరేంద్ర మోదీతో భేటి అయ్యింది. ఆటగాళ్లతో పాటు ప్రధాన కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ ఉన్నారు. ఈ సందర్భంగా మోదీ వారితో కాపేపు ఆప్యాయంగా ముచ్చటించారు. అలాగే భారత క్రీడాకారులు మెగా ఈవెంట్‌లో తమకు ఎదురైన అనుభవాలను ప్రధాని మోడీతో షేర్ చేసుకున్నారు. ఆ విషయాన్ని కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ ట్విటర్‌లో ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. 73 ఏళ్ల బ్యాడ్మింటన్ చరిత్రలో తొలిసారిగా థామస్ కప్‌ను గెలుచుకుంది భారత్. థామస్‌ కప్‌.. ప్రపంచ బ్యాడ్మింటన్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన టోర్నమెంట్‌. ఇందులో మొన్నటి దాకా భారత జట్టు పతకమే గెలవలేదు. 14 సార్లు ఛాంపియన్ ఇండోనేషియాను ఓడించి భారత్ ఈ ఘనత సాధించింది.

1979 తర్వాత కనీసం ఈ టోర్నమెంట్లో సెమీస్‌ కూడా చేరలేదు. అలాంటిది ఈ పర్యాయం భారత షట్లర్లు అద్భుత ప్రదర్శన చూపించారు. మేటి జట్లను మట్టికరిపిస్తూ.. ఏకంగా స్వర్ణం సాధించి హిస్టరీ క్రియేట్ చేశారు. ఫైనల్లో ప్రత్యర్థికి అవకాశమే ఇవ్వకుండా వరుసగా మూడు విజయాలతో భారత్‌ ట్రోఫీని ముద్దాడింది. తెలుగు కుర్రాళ్లు కిదాంబి శ్రీకాంత్‌, సాత్విక్‌ సాయిరాజ్‌ ఈ చరిత్రాత్మక విజయంలో కీలక పాత్ర పోషించారు.

ఇవి కూడా చదవండి

అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ కూడా క్రీడాకారులను అభినందించారు. భారత బ్యాడ్మింటన్‌ జట్టు చరిత్ర సృష్టించిందని అన్నారు. థామస్ కప్ గెలవాలని దేశం మొత్తం ఉత్సుకతతో ఉంది. ఈ సందర్భంగా ఆటగాళ్లు తమ అనుభవాలను ప్రధానితో పంచుకున్నారు. థామస్ కప్ గెలిచిన భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ..  ‘దేశం తరపున నేను మొత్తం జట్టుకు అభినందనలు తెలియజేస్తున్నాను. ఇది చిన్న విజయం కాదు. ఏదైనా టోర్నమెంట్‌లో ఏదైనా నిర్ణయాత్మక మ్యాచ్ ఊపిరి తీసుకుంటుందని ప్రధాని అన్నారు. దీనిపై ఆటగాళ్లు మాట్లాడుతూ.. మ్యాచ్ మొదటిదైనా చివరిదైనా మనం ఎప్పుడూ దేశ విజయాన్ని చూస్తూనే ఉంటాం.

ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘థామస్ టైటిల్ గెలిచే జాబితాలో మా జట్టు చాలా వెనుకబడి ఉండేది. భారతీయులు ఈ టైటిల్ పేరును ఎన్నడూ విని ఉండరు, కానీ ఈ రోజు మీరు దీన్ని దేశంలో ప్రాచుర్యం పొందారు. కష్టపడితే ఏదైనా సాధించవచ్చన్న స్ఫూర్తిని ఈ భారత జట్టు కల్పించింది. ఒత్తిడి ఉంటే ఫర్వాలేదు.. కానీ దానిలో ఏదో లోపం ఉంది. ఒత్తిడి నుంచి బయటపడి చరిత్ర సృష్టించారు. ఈ సమావేశంలో, కిదాంబి శ్రీకాంత్, సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి, లక్ష్య సేన్ మరియు హెచ్‌ఎస్ ప్రణయ్‌లతో ప్రధాని మోదీ మాట్లాడి, వారిని ప్రోత్సహించారు. ఉజ్వల భవిష్యత్తు కోసం వారికి శుభాకాంక్షలు తెలిపారు.