PM Modi – Neeraj Chopra: నీరజ్ చోప్రాతో మాట్లాడిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..

Paris Olympics 2024: నీరజ్ చోప్రాతో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా పారిస్ ఒలింపిక్స్ 2024లో రజత పతకం సాధించిన నీరజ్‌ని పీఎం అభినందించారు. అలాగే నీరజ్ చోప్రా గాయం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

PM Modi - Neeraj Chopra: నీరజ్ చోప్రాతో మాట్లాడిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..
Pm Modi Neeraj Chopra

Updated on: Aug 09, 2024 | 3:07 PM

PM Modi – Neeraj Chopra: నీరజ్ చోప్రాతో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా పారిస్ ఒలింపిక్స్ 2024లో రజత పతకం సాధించిన నీరజ్‌ని పీఎం అభినందించారు. అలాగే నీరజ్ చోప్రా గాయం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే నీరజ్ క్రీడా స్ఫూర్తిని ప్రధాని మోదీ ఎంతో మెచ్చుకున్నారు.

అంతకుముందు నీరజ్ చోప్రాకు ప్రధాని మోదీ ట్వీట్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. రజత పతకం సాధించినందుకు అభినందనలు అంటూ పోస్ట్‌ చేశారు. రాబోయే క్రీడాకారులు, వారి కలలను నెరవేర్చుకోవడానికి ఎంతో స్ఫూర్తిని అందించావంటూ కొనియాడారు.

నీరజ్ చోప్రా పదే పదే తన ప్రతిభను చాటుకుంటున్నాడు. మరోసారి ఒలింపిక్స్‌లో విజయం సాధించడంపై భారత్ గర్విస్తోందని పీఎం అన్నారు. రజత పతకం సాధించినందుకు ప్రధాని అభినందనలు తెలిపారు.

పారిస్ ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా మళ్లీ తన ప్రతిభను చాటి చెప్పాడు. రజతం సాధించడం ద్వారా ఈ భారత అథ్లెట్ భారత్‌కు నాలుగో పతకాన్ని అందించాడు. కాగా, పాకిస్థాన్‌కు చెందిన అర్షద్ నదీమ్ స్వర్ణ పతకాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విక్కీ కౌశల్, ఆర్ మాధవన్, మలైకా అరోరా వంటి బాలీవుడ్ స్టార్లు నీరజ్ చోప్రాను అభినందించారు.