Chess Olympiad: చెస్‌ ఒలింపియాడ్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ.. టోర్నీకి తరలివచ్చిన 190 దేశాల చెస్ క్రీడాకారులు

|

Jul 28, 2022 | 8:09 PM

తమిళనాడు చెన్నైలో జరుగుతున్న ఈ క్రీడోత్సవానికి 180 దేశాల నుంచి 1700 మంది చెస్‌ క్రీడాకారులు తరలి వచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ చెస్‌ ఒలింపియాడ్‌ ప్రారంభించారు.

Chess Olympiad: చెస్‌ ఒలింపియాడ్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ.. టోర్నీకి తరలివచ్చిన 190 దేశాల చెస్ క్రీడాకారులు
Pm Modi
Follow us on

భారత్‌ వేదికగా అతిపెద్ద 44వ చెస్‌ ఒలింపియాడ్‌ ప్రారంభమైంది. తమిళనాడు చెన్నైలో జరుగుతున్న ఈ క్రీడోత్సవానికి 190 దేశాల నుంచి 1700 మంది చెస్‌ క్రీడాకారులు తరలి వచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ చెస్‌ ఒలింపియాడ్‌ ప్రారంభించారు. చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న ప్రారంభోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్​, సూపర్​స్టార్ రజనీకాంత్ కార్యక్రమంలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. స్టేడియంలో ఎక్కడ చూసినా బ్లాక్ అండ్ వైట్ చెస్ గడులు కనిపించేలా ఏర్పాట్లు చేశారు. భారీ చెస్ పావులను గడుల్లో నిలిపారు. ఈ కార్యక్రమ ప్రారంభ వేడుకలో సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు అక్కడికి వచ్చినవారిని ఆకట్టుకున్నాయి.  చెన్నైలో 44వ చెస్ ఒలింపియాడ్ ప్రారంభోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సత్కరించారు.

ఉక్రెయిన్ ​పై రష్యా యుద్ధం ప్రకటించడంతో.. రష్యాలో జరగాల్సిన చెస్ ఒలింపియాడ్‌కు ఆతిథ్యం భారత్‌కు మారింది. అతి తక్కువ సమయంలో భారీ ఏర్పాట్లు చేసింది. 190 దేశాల నుంచి చెస్ క్రీడాకారులు ఈ ఒలింపియాడ్‌లో పాల్గొంటున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం..