AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ballon World Cup: ‘బెలూన్‌’ వరల్డ్‌ ఛాంపియన్‌గా పెరూ ఆటగాడు!! వివరాలివే..

మనం చిన్నప్పుడు బెలూన్లతో సరదాగా ఎన్నో ఆటలాడి ఉంటాం. వాటిని గాలితో నింపి పైకి ఎగరేస్తూ కింద పడకుండా పందేలు కూడా వేసుకుని ఉంటాం..

Ballon World Cup: 'బెలూన్‌' వరల్డ్‌ ఛాంపియన్‌గా పెరూ ఆటగాడు!! వివరాలివే..
Peru Player
Ravi Kiran
|

Updated on: Oct 19, 2021 | 9:20 AM

Share

మనం చిన్నప్పుడు బెలూన్లతో సరదాగా ఎన్నో ఆటలాడి ఉంటాం. వాటిని గాలితో నింపి పైకి ఎగరేస్తూ కింద పడకుండా పందేలు కూడా వేసుకుని ఉంటాం. అయితే ఇప్పుడు ఆ సరదా ఆటే అంతర్జాతీయ క్రీడగా మారిపోయింది. బెలూన్లతో ఏకంగా ప్రపంచ కప్‌ పోటీలు నిర్వహించారు. స్పెయిన్‌ వేదికగా మొదటిసారిగా జరిగిన ఈ పోటీల్లో పెరూకు చెందిన ఫ్రాన్సెస్కో డి లా క్రూజ్‌ ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచాడు.

‘టిక్‌టాక్‌’ స్ఫూర్తితో!

కరోనా లాక్‌డౌన్‌లో బాగా పాపులర్‌ అయిన ఆటల్లో బెలూన్‌ గేమ్స్‌ కూడా ఒకటి. చాలామంది వీటిని కింద పడకుండా ఎగరేస్తూ ఉండే వీడియోలను తీసి టిక్‌ టాక్‌ తదితర సోషల్‌ మీడియా మాధ్యమాల్లో ఉంచారు. ఇవి నెటిజన్లను తెగ ఆకట్టుకున్నాయి. బార్సిలోనాకు చెందిన ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు గెరార్డ్‌ పిక్‌…సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ ఇబయ్ లియానోస్‌ ఈ వీడియోలను చూసి అంతర్జాతీయ బెలూన్ల పోటీలు నిర్వహిస్తే ఎలా ఉంటుందని ఆలోచించారు. అనుకున్నదే తడవుగా తమ ఆలోచనలను ఆచరణలోకి తీసుకొచ్చారు. స్పెయిన్‌లోని తారాగోనా నగరంలోని ఓ స్టేడియంను బెలూన్‌ వరల్డ్‌ కప్‌ పోటీలకు వేదికగా ఎంచుకున్నారు.

ఎలా ఆడాలంటే..!

పోటీల్లో భాగంగా 8×8 మీటర్ల కోర్టు ఏర్పాటు చేస్తారు. అందరి ఇళ్లల్లో ఉండే సోఫాలు, కుర్చీలు, టేబుళ్లు తదితర వస్తువులను అక్కడ ఉంచుతారు. ఇద్దరు పోటీ దారులను పిలిచి ఒక బెలూన్‌ వారికి అందజేస్తారు. ఒకరి తర్వాత ఒకరు దానిని కింద పడకుండా చేత్తో గాల్లోకి ఎగరేయాలి. బెలూన్‌ కోర్టులోని వస్తువులను తాకుకుండా, కింద పడకుండా జాగ్రత్తగా గేమ్‌ ఆడాలి. ఒకవేళ బెలూన్‌ కింద పడితే…ప్రత్యర్థి క్రీడాకారుడికి ఒక పాయింట్ ఇస్తారు. అలా నిర్ణీత సమయంలో ఎవరికి ఎక్కువ పాయింట్లు వస్తాయో వారే విజేతగా నిలుస్తారు. 32 దేశాల క్రీడాకారులు!

అమెరికా, రష్యా, చైనా, స్పెయిన్‌, ఇటలీ, ఆస్ట్రేలియా, జర్మనీ, బ్రెజిల్, అర్జెంటీనా, పెరూ, బల్గేరియాతో సహా మొత్తం 32 దేశాల క్రీడాకారులు ఈ పోటీల్లో తమ అదృష్టం పరీక్షించుకున్నారు. మొత్తం ఐదు దశల్లో పోటీలు జరగ్గా జాన్‌ స్పైసెస్‌ (జర్మనీ), ఫ్రాన్సెస్కో డి లా క్రూజ్‌ (పెరూ) ఫైనల్స్‌కు చేరుకున్నారు. తాజాగా జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో డి లా క్రూజ్‌ 6-2 తేడాతో జాన్‌పై విజయం సాధించి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచాడు. బెలూన్ ప్రపంచ కప్ పోటీలకు సంబంధించిన వీడియోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ గేమ్‌కి సంబంధించి తమ అనుభవాలను కామెంట్ల రూపంలో పోస్ట్‌ చేస్తున్నారు.

దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ