Fifa World Cup 2022: గత రాత్రి ఫిపా ప్రపంచ కప్ 2022లో, మొరాకో టీం పోర్చుగల్‌పై తిరుగులేని విజయం సాధించి చరిత్ర సృష్టించింది. మొరాకో 1-0తో పోర్చుగల్‌ను ఓడించి టోర్నీలో సెమీ-ఫైనల్‌కు చేరుకుంది. ఈ విజయం మొరాకో ఆటగాళ్లకు చాలా పెద్దది. అందుకే మ్యాచ్ ముగిసిన తర్వాత వారు దానిని ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. మొరాకో కోసం వింగర్ లేదా అటాకింగ్ మిడ్‌ఫీల్డర్‌గా ఆడే సోఫీ బౌఫాల్, ఈ విజయాన్ని తన తల్లితో కలిసి సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో తగె వైరల్ అవుతోంది.
బౌఫాల్, అతని తల్లి మ్యాచ్ ముగిసిన తర్వాత మైదానంలో డ్యాన్స్ చేయడం వీడియోలో చూడొచ్చు. ఈ విజయంతో ఇద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు. బౌఫాల్, అతని తల్లి కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కొద్ది గంటల్లోనే దాదాపు లక్షన్నర మంది ఈ వీడియోను వీక్షించారు.
Morocco’s Sofiane Boufal celebrating with his mother is EVERYTHING.
— Ahmed Ali (@MrAhmednurAli) December 10, 2022
ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌కు చేరిన తొలి ఆఫ్రికన్ జట్టుగా పోర్చుగల్‌ను ఓడించి మొరాకో చరిత్ర సృష్టించింది. తొలి అర్ధభాగంలో ఏ జట్టు కూడా గోల్ చేయలేకపోయింది. కానీ రెండో అర్ధభాగంలో మొరాకో గోల్ చేయడం ద్వారా మ్యాచ్‌పై పట్టును పటిష్టం చేసుకుంది. మొరాకో టోర్నమెంట్ అంతటా డీప్ డిఫెన్స్ ఆడింది. ఈ మ్యాచ్‌లో కూడా వారి డిఫెన్స్ బలాన్నే నమ్ముకుంది. ఈ ఓటమితో క్రిస్టియానో రొనాల్డో ప్రపంచకప్ కల మరోసారి చెదిరిపోయింది. ఇప్పుడు సెమీస్‌లో ఫ్రాన్స్‌తో తలపడనుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..