ఇస్తాంబుల్‌లో జరిగిన మహిళల ప్రపంచ ఛాంపియన్‌షిప్(Womens World Boxing Championships 2022) ఫైనల్లో భారత బాక్సర్ నిఖత్ జరీన్(Nikhat Zareen) విజయం సాధించి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఫ్లైవెయిట్ (52 కిలోలు) విభాగంలో థాయిలాండ్‌కు చెందిన జిట్‌పాంగ్ జుటామాస్‌ను 5-0తో ఓడించి సరికొత్త చరిత్రను నెలకొల్పింది. తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్‌కు చెందిన బాక్సర్ జరీన్.. ఈ విజయంతో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన ఐదో భారతీయ మహిళా బాక్సర్‌గా నిలిచింది. అయితే, నిఖత్ సాధించిన ఈ అద్భుత విజయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(PM Narendra Modi), కేంద్ర హోంమంత్రి అమిత్ షా, తెలంగాణ సీఎం కేసీఆర్‌తోపాటు పలువురు ప్రముఖులు కూడా అభినందనలు తెలిపారు. తాజాగా ఈ లిస్టులో మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్ర కూడా చేరారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో నిఖత్‌ను అభినందించారు. ‘నువ్వు ఏమిటో, భారతదేశం అంటే ఏమిటో ప్రపంచానికి చాటి చెప్పావ్’ అంటూ కొనియాడారు.
“భారత బాక్సర్. ప్రపంచ ఛాంపియన్. 5-0తో విజయం సాధించింది. మీరు ఏమిటో, భారతదేశం అంటే ఏమిటో ప్రపంచానికి చెప్పినందుకు #NikhatZareen ధన్యవాదాలు. అన్‌స్టాపబుల్” అని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.
ఆరుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఎంసీ మేరీకోమ్ (2002, 2005, 2006, 2008, 2010, 2018), సరితా దేవి (2006), జెన్నీ ఆర్‌ఎల్ (2006), లేఖా కేసీ ఇంతకు ముందు ప్రపంచ టైటిల్‌లు గెలుచుకున్నారు. జరీన్ బంగారు పతకాలతో పాటు, మనీషా మోన్ (57 కేజీలు), అరంగేట్రం పర్వీన్ హుడా (63 కేజీలు) కాంస్య పతకాలను గెలుచుకున్నారు.
భారత్ నుంచి 12 మంది సభ్యుల బృందం ఈ టోర్నీలో పాల్గొంది. గత టోర్నీతో పోలిస్తే భారత్ పతకాల సంఖ్య తగ్గింది. అయితే నాలుగేళ్ల తర్వాత భారత బాక్సర్ ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. మేరీకోమ్ 2018లో భారత్‌కు చివరి స్వర్ణ పతకాన్ని అందించింది.
Indian boxer. World champion. 5-0 victory. Thank you #NikhatZareen for telling the world what you are and what India is. UNSTOPPABLE pic.twitter.com/idV1yCGG7M
— anand mahindra (@anandmahindra) May 19, 2022
Also Read: Nikhat Zareen: నీ విజయంతో భారత్ గర్విస్తోంది.. నిఖత్ జరీన్‌ను అభినందించిన ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్