బెంగుళూరులో జరుగుతోన్న ఖేలో ఇండియా యూనివర్శిటీ గేమ్స్(Khelo India University Games) 2021 మూడవ రోజు కూడా చాలా ఉత్సాహంగా జరిగాయి. అనేక ఈవెంట్‌లలో క్రీడాకారులు పతకాలు గెలుచుకున్నారు. రెండవ రోజు మాదిరిగానే, ఏప్రిల్ 26, మంగళవారం మూడో రోజు, బెంగుళూరులోని జైన్ యూనివర్శిటీ ఆధిపత్యం చెలాయించింది. మరో 4 బంగారు పతకాలతో పతకాల పట్టికలో ఆధిక్యాన్ని బలోపేతం చేసింది. ప్రస్తుతం జైన్ యూనివర్శిటీ ఖాతాలో 7 స్వర్ణాలతో సహా మొత్తం 10 పతకాలు ఉన్నాయి. మరోవైపు ముంబై యూనివర్సిటీ 5 స్వర్ణాలతో రెండో స్థానంలో ఉంది. మూడో రోజు మహిళల బాక్సింగ్‌లో కురుక్షేత్ర యూనివర్సిటీకి చెందిన వింకా ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. గతేడాది యూత్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో వింకా స్వర్ణ పతకం సాధించింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
IPL 2022: ముంబై, సీఎస్‌కే జట్లు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తాయా.? ఇవిగో లెక్కలు.!