Swiss Open 2021: దూకుడు మీదున్న భారత షట్లర్లు.. క్వార్టర్స్‌లో అడుగు పెట్టిన సింధు, శ్రీకాంత్‌, సాయి‌..

|

Mar 05, 2021 | 1:26 PM

Swiss Open 2021: స్విట్జర్లాండ్‌లోని బాసెల్‌ వేదికగా జరుగుతోన్న స్విస్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ 2021లో భారత షట్లరు మంచి ప్రతిభను కనబరుస్తున్నారు. స్టార్‌ ప్లేయర్లు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్‌, సాయి ప్రణీత్‌ క్వార్టర్స్‌లో అడుగుపెట్టారు...

Swiss Open 2021: దూకుడు మీదున్న భారత షట్లర్లు.. క్వార్టర్స్‌లో అడుగు పెట్టిన సింధు, శ్రీకాంత్‌, సాయి‌..
Follow us on

Swiss Open 2021: స్విట్జర్లాండ్‌లోని బాసెల్‌ వేదికగా జరుగుతోన్న స్విస్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ 2021లో భారత షట్లరు మంచి ప్రతిభను కనబరుస్తున్నారు. స్టార్‌ ప్లేయర్లు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్‌, సాయి ప్రణీత్‌ క్వార్టర్స్‌లో అడుగుపెట్టారు.
ఇక మూడో సీడ్‌ రాస్మస్‌ గెమ్కేను అజయ్‌ జయరామ్‌ ఓడించాడు. మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌ పీవీ సింధు 21-13, 21-14 తేడాతో అమెరికా ప్లేయర్‌ ఎల్రిస్‌ వాంగ్‌ ఓడించింది. కేవలం 35 నిమిషాల్లోనే ఈ గేమ్‌ను అలవోకగా గెలిచేసింది సింధు. అజయ్‌ జయరామ్‌ 21-18, 17-21, 21-13 తేడాతో డెన్మార్క్‌కు చెందిన సీడ్‌ గెమ్కేను ఓడించి క్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. మరో ఇండియన్‌ ప్లేయర్‌ బి.సాయి ప్రణీత్‌ 21-12, 21-17 తేడాతో స్పెయిన్‌ ప్లేయర్‌ పాబ్లో ఎబియన్‌ను అవలీలగా ఓడించాడు. ఇక కిడాంబి శ్రీకాంత్‌ విషయానికొస్తే.. 21-10, 14-21, 21-14 తేడాతో ఫ్రాన్స్‌కు చెందిన థామస్‌ రౌక్సెల్‌పై విజయాన్ని నమోదు చేసుకున్నాడు.
పురుషుల డబుల్స్‌లో భారత స్టార్‌ ప్లేయర్లు సాత్విక్ సాయిరాజ్‌-చిరాగ్ శెట్టి 21-17, 20-22, 21-17తో ఇండోనేషియా జోడీ కుసుమవర్దన, రాంబిటాన్‌ జోడీని ఓడించి క్వార్టర్స్‌లో అడుగుపెట్టారు. మిక్స్‌డబుల్స్‌లో మంచి ఫామ్‌లో ఉన్న సాత్విక్‌ – అశ్విని పొన్నప్ప ద్వయం 21-18- 21-16 తేడాతో ఇండోనేషియా ప్లేయర్స్‌ రివాల్డీ-పితా మెంటారీలపై భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇదిలా ఉంటే సైనా నెహ్వాల్‌ మాత్రం ఓడిపోయింది. మహిళల సింగిల్స్‌లో థాయ్‌లాండ్‌కు చెందిన చైవాన్‌ చేతిలో 16-21, 21-17, 21-23 పోరాడి ఓడింది. మహిళల డబుల్స్‌లో ఇండియన్‌ ప్లేయర్స్‌ ఎన్‌.సిక్కిరెడ్డి – పొన్నప్ప జోడీ ఓటమిని చవి చూసింది.

Also Read: India vs England 4th Test Live: రెండో రోజు మొదలైన ఆట.. కష్టాల్లో భారత్…వరుసగా వికెట్లు

ఖతార్‌లో సానియా మీర్జా జోడీకి చుక్కెదురు.. టాప్​-200లోకి ఎంట్రీ ఇచ్చిన హైదరాబాద్ టెన్నిస్ స్టార్

Boxer MaryKom : బాక్సింగ్‌లో భారత్‌కి మరో పతకం ఖాయం.. బాక్సమ్‌ ఓపెన్‌ టోర్నీలో సెమీస్‌కి దూసుకెళ్లిన మేరీకోమ్‌