Asian Champions Trophy Final: ఫైనల్‌లో చైనాకు ఇచ్చిపడేసిన భారత్.. 5వ సారి ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ కైవసం..

|

Sep 17, 2024 | 5:35 PM

India Beats China Asian Champions Trophy Final: భారత హాకీ జట్టు ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను గెలుచుకుంది. సొంత మైదానంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు 1-0తో చైనాను ఓడించింది. చివరి క్వార్టర్‌లో జుగ్‌రాజ్ సింగ్ గోల్‌తో భారత్ చైనాను ఓడించి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది.

Asian Champions Trophy Final: ఫైనల్‌లో చైనాకు ఇచ్చిపడేసిన భారత్.. 5వ సారి ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ కైవసం..
Hockey India
Follow us on

India Beats China Asian Champions Trophy Final: భారత హాకీ జట్టు ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను గెలుచుకుంది. సొంత మైదానంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు 1-0తో చైనాను ఓడించింది. చివరి క్వార్టర్‌లో జుగ్‌రాజ్ సింగ్ గోల్‌తో భారత్ చైనాను ఓడించి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది.

తొలి క్వార్టర్‌లో భారత్‌కు గోల్‌ చేసేందుకు ఎన్నో అవకాశాలు వచ్చినా టీమ్‌ ఇండియా గోల్‌ చేయలేకపోయింది. పెనాల్టీ కార్నర్‌లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ వరుసగా రెండు అవకాశాలను చేజార్చుకున్నాడు. దీంతోపాటు గోల్ చేసే సువర్ణావకాశాన్ని కూడా చైనా చేజార్చుకుంది. చైనా గోల్‌కీపర్ వరుసగా మూడు-నాలుగు అద్భుతమైన సేవ్‌లు చేశాడు. లేకపోతే టీమ్ ఇండియా ఖచ్చితంగా స్కోర్ చేసేది. ఈ కారణంగా తొలి క్వార్టర్‌లో భారత జట్టు ఒక్క గోల్ కూడా చేయలేకపోయింది. రెండో క్వార్టర్‌లో భారత్‌కు పెనాల్టీ కార్నర్ లభించినా మరోసారి టీమ్ ఇండియా గోల్ చేయలేకపోయింది. ఈ క్వార్టర్‌లో కూడా భారత జట్టు ఒక్క గోల్‌ చేయలేకపోయింది. చైనా కూడా గోల్‌ చేయలేకపోయింది. దీంతో తొలి అర్ధభాగం 0-0తో ముగిసింది.

నాలుగో క్వార్టర్‌లో భారత జట్టు గోల్..

మూడో క్వార్టర్‌లో చైనాకు పెనాల్టీ కార్నర్ లభించినా మరోసారి దానిని గోల్‌గా మార్చలేకపోయింది. టీమ్ ఇండియా కూడా తీవ్రంగా ప్రయత్నించినా చైనా పటిష్ట డిఫెన్స్ భారత జట్టును గోల్ చేసేందుకు వీలు కల్పించలేదు. మరోవైపు చైనాకు కూడా వరుసగా రెండు పెనాల్టీ కార్నర్‌లు లభించినా భారత్‌ ఇక్కడ గోల్‌ చేయనివ్వలేదు. ఈ విధంగా ఇరు జట్లు తీవ్రంగా ప్రయత్నించినా గోల్‌ చేయలేకపోయాయి. ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. నాలుగో క్వార్టర్ సమయంలో, జుగ్రాజ్ సింగ్ ఫీల్డ్ గోల్ చేయడం ద్వారా భారత్‌కు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. జుగ్‌రాజ్ డిఫెండర్ అయినప్పటికీ కీలకమైన సమయంలో అద్భుతంగా గోల్ చేసి టీమ్ ఇండియాకు ఆధిక్యాన్ని అందించాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..