Neeraj Chopra: పారిస్ ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడల్ గెలిచాక నీరజ్ ఏమన్నారంటే.?

|

Aug 09, 2024 | 7:12 AM

పారిస్ ఒలింపిక్స్‌లో గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. వరుసగా రెండు సార్లు ఒలింపిక్ పతకాలను తన ఖాతాలో వేసుకున్నారు. శుక్రవారం జరిగిన జావెలిన్ త్రో ఫైనల్‌లో బల్లెం 89.45m దూరం విసిరి రెండో స్థానంలో నిలిచారు. తద్వారా రజతాన్ని సొంతం చేసుకున్నారు.

Neeraj Chopra: పారిస్ ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడల్ గెలిచాక నీరజ్ ఏమన్నారంటే.?
Neeraj Chopra
Follow us on

పారిస్ ఒలింపిక్స్‌లో గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. వరుసగా రెండు సార్లు ఒలింపిక్ పతకాలను తన ఖాతాలో వేసుకున్నారు. గురువారం జరిగిన జావెలిన్ త్రో ఫైనల్‌లో బల్లెం 89.45m దూరం విసిరి రెండో స్థానంలో నిలిచారు. తద్వారా రజతాన్ని సొంతం చేసుకున్నారు. అలాగే  పాక్ అథ్లెట్ నదీమ్ 92.97m విసిరి తొలి స్థానంలో నిలిచి స్వర్ణం కైవసం చేసుకున్నారు. గ్రెనడా అథ్లెట్ పీటర్స్ కాంస్య పతకాన్ని గెలిచారు. మరోవైపు ఈ ఒలింపిక్స్‌లో భారత్‌కు ఇది తొలి రజతం కాగా.. మొత్తం పతకాల సంఖ్య ఐదుకు చేరింది. రజతంతో.. నీరజ్ చోప్రా ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన నాలుగో భారతీయుడిగా నిలిచారు. 2008, 2012లో సుశీల్ కుమార్, 2016, 2020లో పీవీ సింధు, 2024లో మనూ భాకర్ ఈ లిస్టులో నీరజ్ చోప్రా కంటే ముందున్నారు. మనూ భాకర్ ఈ ఒలింపిక్స్‌లోనే రెండు మెడల్స్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. నీరజ్ టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలుచుకోగా.. ఈసారి రజతం అందుకున్న విషయం తెలిసిందే.

పారిస్ ఒలింపిక్స్‌లో సిల్వర్ గెలిచాక నీరజ్ చోప్రా మాట్లాడుతూ స్వర్ణ విజేత అర్షద్ నదీమ్‌కు అభినందనలు తెలిపారు. ‘2016 నుంచి అతనితో పోటీ పడుతున్నాను. కానీ తోలిసారి ఓడిపోయాను. అర్షద్ నిజంగా చాలా కష్టపడ్డాడు. ఇవాళ నాకన్నా ఉత్తమ ప్రదర్శన చేశాడు’ అని పేర్కొన్నారు. మరోవైపు ఇతర అథ్లెట్ల వలె తనకు వసతులు లేవని, ఉన్నవాటితోనే కష్టపడినట్టు గోల్డ్ విన్నర్ నదీమ్ చెప్పారు.

నీరజ్‌ చోప్రా సిల్వర్‌ మెడల్‌ సాధించడంతో హర్యానాలోని ఆయన ఇంటి దగ్గర సంబరాలు మిన్నంటాయి. ఆయన కుటుంబ సభ్యులు స్వీట్లు పంచుకుని పండగ చేసుకున్నారు. అటు పారిస్ ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా గెలిచిన సిల్వర్ మెడల్ తనకు బంగారంతో సమానమని ఆయన తల్లి సరోజ్ దేవి తెలిపారు. నీరజ్‌కు గాయమైందని, అయినప్పటికీ అతని ప్రదర్శనతో తాము చాలా సంతోషంగా ఉన్నామని అన్నారు. అటు స్వర్ణం గెలిచిన నదీమ్ కూడా తనకు కొడుకుతో సమానమని అభివర్ణించారామె.

మరిన్ని ఒలింపిక్స్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..