PKL Playoffs 2024: చిత్తుగా ఓడిన గుజరాత్‌ జెయింట్స్‌.. సెమీస్‌లో హర్యానా స్టీలర్స్‌

Pro Kabaddi League 2024: ఎలిమినేటర్‌ 2 మ్యాచ్‌లో గుజరాత్‌ జెయింట్స్‌ అంచనాలను అందుకోలేదు. కూతలో ఆ జట్టు హర్యానా స్టీలర్స్‌తో గట్టిగా పోరాడినా.. డిఫెన్స్‌లో చేతులెత్తేసింది. రెయిడింగ్‌లో గుజరాత్‌ జెయింట్స్‌ 16 పాయింట్లు సాధించగా.. హర్యానా స్టీలర్స్‌ 19 పాయింట్లు సొంతం చేసుకుంది. ఇక డిఫెన్స్‌లో స్టీలర్స్‌ షో సాగింది. మూడుసార్లు గుజరాత్‌ జెయింట్స్‌ను ఆలౌట్‌ చేసిన హర్యానా స్టీలర్స్‌ డిఫెన్స్‌లో 14 పాయింట్లు సాధించింది. గుజరాత్‌ జెయింట్స్‌ డిఫెన్స్‌లో కేవలం ఐదు పాయింట్లతో సరిపెట్టుకుని భారీ మూల్యం చెల్లించుకుంది.

PKL Playoffs 2024: చిత్తుగా ఓడిన గుజరాత్‌ జెయింట్స్‌.. సెమీస్‌లో హర్యానా స్టీలర్స్‌
Pro Kabaddi
Follow us

|

Updated on: Feb 27, 2024 | 12:32 PM

Pro Kabaddi League 2024: హర్యానా స్టీలర్స్‌ ప్రొ కబడ్డీ లీగ్‌ పదో సీజన్‌ సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది. సోమవారం హైదరాబాద్‌లోని జిఎంసీ బాలయోగి ఇండోర్‌ స్టేడియంలో జరిగిన ఎలిమినేటర్‌ 2 మ్యాచ్‌లో హర్యానా స్టీలర్స్‌ 42-25తో గుజరాత్‌ జెయింట్స్‌పై ఘన విజయం సాధించింది. డిఫెన్స్‌లో గుజరాత్‌ జెయింట్స్‌ను పట్టేసిన హర్యానా స్టీలర్స్‌ భారీ తేడాతో గెలుపొందింది. గురువారం జరిగే సెమీఫైనల్‌ 2లో డిఫెండింగ్‌ చాంపియన్‌ జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌తో హర్యానా స్టీలర్స్‌ పోటీపడనుంది. హర్యానా స్టీలర్స్‌ తరఫున వినయ్‌ 12 పాయింట్లతో కూతలో కేక పెట్టించగా.. డిఫెన్స్‌లో మోహిత్‌ ఏడు ట్యాకిల్స్‌తో అదరగొట్టాడు. ఎలిమినేటర్‌ 2 మ్యాచ్‌లో చేతులెత్తేసిన గుజరాత్‌ జెయింట్స్‌ ప్రో కబడ్డీ లీగ్‌ పదో సీజన్‌ టైటిల్‌ రేసు నుంచి వైదొలిగింది.

ఎలిమినేటర్‌ 2 మ్యాచ్‌లో గుజరాత్‌ జెయింట్స్‌ అంచనాలను అందుకోలేదు. కూతలో ఆ జట్టు హర్యానా స్టీలర్స్‌తో గట్టిగా పోరాడినా.. డిఫెన్స్‌లో చేతులెత్తేసింది. రెయిడింగ్‌లో గుజరాత్‌ జెయింట్స్‌ 16 పాయింట్లు సాధించగా.. హర్యానా స్టీలర్స్‌ 19 పాయింట్లు సొంతం చేసుకుంది. ఇక డిఫెన్స్‌లో స్టీలర్స్‌ షో సాగింది. మూడుసార్లు గుజరాత్‌ జెయింట్స్‌ను ఆలౌట్‌ చేసిన హర్యానా స్టీలర్స్‌ డిఫెన్స్‌లో 14 పాయింట్లు సాధించింది. గుజరాత్‌ జెయింట్స్‌ డిఫెన్స్‌లో కేవలం ఐదు పాయింట్లతో సరిపెట్టుకుని భారీ మూల్యం చెల్లించుకుంది.

గుజరాత్‌ జెయింట్స్‌, హర్యానా స్టీలర్స్‌ ఎలిమినేటర్‌ పోరు రసవత్తరవంగా మొదలైంది. ప్రథమార్థంలో ఇరు జట్ల్లు పాయింట్ల కోసం పోటాపోటీగా తలపడ్డాయి. గుజరాత్‌ జెయింట్స్‌ తరఫున పర్తీక్‌ దహియ, రాకేశ్‌ సుంగ్రోయ సోను జగ్లాన్‌లు మెరువగా.. హర్యానా స్టీలర్స్‌ తరఫున వినయ్‌, శివం పటారె, మోహిత్‌లు రాణించారు. ఉత్కంఠగా సాగిన ప్రథమార్థంలో హర్యానా స్టీలర్స్‌ 21-16తో ఆధిక్యం సాధించింది.

ద్వితీయార్థం పూర్తి ఏకపక్షంగా సాగింది. హర్యానా స్టీలర్స్‌ స్టార్ రెయిడర్‌ వినయ్‌ వరుసగా కూతకెళ్లి పాయింట్లు తీసుకురాగా.. డిఫెండర్‌ మోహిత్‌ సూపర్‌ ట్యాకిల్స్‌తో మెప్పించాడు. దీంతో గుజరాత్‌ జెయింట్స్‌ స్వల్ప విరామాల్లోనే ఆలౌట్‌ కాక తప్పలేదు. స్టీలర్స్‌ రెయిడర్స్‌, డిఫెండర్ల దెబ్బకు సెకండ్‌హాఫ్‌లో గుజరాత్‌ జెయింట్స్‌ కేవలం 9 పాయింట్లే సాధించింది. మరోవైపు హర్యానా స్టీలర్స్‌ విరామం అనంతరం సైతం మరో 21 పాయింట్లు ఖాతాలో వేసుకుంది. 42-25తో 17 పాయింట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ప్రో కబడ్డీ లీగ్‌ పదో సీజన్‌ సెమీఫైనల్స్‌కు చేరుకుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..