
WWE మాజీ సూపర్ స్టార్ జెఫ్ హార్డీ(Jeff Hardy) కష్టాలు మరింత పెరిగాయి. మద్యం సేవించి డ్రైవింగ్ చేశాడనే ఆరోపణలపై హార్డీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనితో పాటు, సస్పెండ్ చేసిన లేదా రద్దు చేసిన లైసెన్స్‌తో డ్రైవింగ్ చేయడం, డ్రైవింగ్ లైసెన్స్‌పై విధించిన పరిమితులను ఉల్లంఘించినందుకు కూడా హార్డీపై అభియోగాలు మోపారు. హార్డీ 10 ఏళ్లలో మూడోసారి ఇలాంటి కేసులో చిక్కుకున్నాడు. అరెస్ట్ వారెంట్ ప్రకారం, వోలుసియా కౌంటీలోని I-95లో డ్రైవర్‌పై పోలీసులకు అనేక కాల్స్ వచ్చాయి. హైవేపై డ్రైవింగ్ నమూనాలు సరిగా లేవని ఆరోపిస్తూ హార్డీ వాహనాన్ని ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర పోలీసులు కారును ఆపారు. జెఫ్ హార్డీ రోడ్డుపై అటుఇటు కారును డ్రైవ్ చేస్తున్నాడని పోలీసులు చెబుతున్నారు.
ఫ్లోరిడాలో అరెస్టు..
జెఫ్ హార్డీ కాళ్లపై సరిగ్గా నిలబడే పరిస్థితి కూడా లేదని పోలీసులు తెలిపారు. అతని నోటి నుంచి మద్యం వాసన వస్తోందని, హార్డీ రెండు వేర్వేరు శ్వాస నమూనాలు .294, .291గా నమోదు అయ్యాయి. ఫ్లోరిడాలో చట్టపరమైన పరిమితి .08గా ఉంది. హార్డీ ప్రస్తుతం కస్టడీలో ఉన్నాడు. నేడు (జూన్ 14) న్యాయమూర్తి ముందు హాజరు కానున్నారు.
ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్..
హార్డీ WWEలో అత్యుత్తమ ఆటతో సత్తా చాటాడు. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ను ఆరుసార్లు గెలుచుకున్నాడు. అలాగే రెండుసార్లు ‘మోస్ట్ పాపులర్ రెజ్లర్ ఆఫ్ ది ఇయర్’గా ఎంపికయ్యాడు. హార్డీ ప్రస్తుతం ఆల్ ఎలైట్ రెజ్లింగ్ (AEW)లో పాల్గొంటున్నాడు. హార్డీ గత దశాబ్ద కాలంగా న్యాయపరమైన సమస్యలను ఎదుర్కొంటున్నాడు. నిషేధిత డ్రగ్స్ స్మగ్లింగ్‌కు సంబంధించిన ఆరోపణలపై 2011లో అతనికి జైలు శిక్ష పడింది. 2017లో తిరిగి వచ్చాడు. కానీ తర్వాత ఆట నుంచి తొలగించారు.