Neymar Retirement: ఫిఫా నుంచి బ్రెజిల్‌ నిష్క్రమణ ఎఫెక్ట్.. స్టార్ ప్లేయర్ రిటైర్మెంట్?

|

Dec 10, 2022 | 8:52 AM

Neymar: ఫిఫా ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్లో బ్రెజిల్ పెనాల్టీ షూటౌట్‌లో క్రొయేషియా చేతిలో ఓడిపోయింది. ఈ ఓటమితో బ్రెజిల్ కల కూడా చెదిరిపోయింది.

Neymar Retirement: ఫిఫా నుంచి బ్రెజిల్‌ నిష్క్రమణ ఎఫెక్ట్.. స్టార్ ప్లేయర్ రిటైర్మెంట్?
Fifa World Cup 2022 Neymar
Follow us on

ఫిఫా ప్రపంచ కప్ నుంచి బ్రెజిల్ నిష్క్రమించింది . క్వార్టర్ ఫైనల్లో, పెనాల్టీ షూటౌట్‌లో క్రొయేషియా దెబ్బకు ఇంటిబాట పట్టింది. ఈ ఓటమి తర్వాత బ్రెజిల్‌ జట్టునే కాదు.. ఆ దేశాన్నే భయపెట్టింది. ఓటమి పాలైన వెంటనే బ్రెజిల్ కోచ్ టైట్ రాజీనామా చేసిన వెంటనే స్టార్ ప్లేయర్ నేమార్ అంతర్జాతీయ ఫుట్‌బాల్ నుంచి రిటైర్ అవుతున్నాడంటూ ఓ వార్త బయటకు వచ్చింది. ఇది ప్రపంచంలోని ప్రతి ఫుట్‌బాల్ అభిమానిని కలవరపరిచింది. నేమార్ రిటైర్మెంట్ గురించే ప్రస్తుతం చర్చ జరుగుతోంది.

క్రొయేషియా చేతిలో ఓడిన తర్వాత నెయ్‌మార్‌ తీవ్రంగా బాధపడ్డాడు. మైదానంలోనే ఏడవడం మొదలుపెట్టాడు. మైదానంలో అతనిని సహచరులు ఎంత ఓదార్చినా.. కన్నీరు ఆగలేదు. ఆ తరువాత, నేమార్ స్వయంగా తన భవిష్యత్తు గురించి ప్రకటన ఇచ్చాడు. అయితే, బ్రెజిల్‌ తరపున ఆడడంపై వచ్చిన వార్తలపై మాట్లాడేందుకు నిరాకరించాడు.

ESPNతో 30 ఏళ్ల నేమార్ మాట్లాడుతూ, ఈ క్షణంలో మాట్లాడటం సరికాదని నా అభిప్రాయం. బహుశా నేను సూటిగా ఆలోచించడం లేదు. ఇది ముగింపు అని చెప్పడం చాలా తొందరగా ఉంటుంది. కానీ, నేను దేనికీ హామీ ఇవ్వను. మరి ఏం జరుగుతుందో చూద్దాం. 2026 ప్రపంచకప్ నాటికి అతడికి 34 ఏళ్లు నిండుతాయి. కాబట్టి ఈ ప్రపంచకప్ అతని చివరి ప్రపంచకప్‌గా పరిగణించారు. ఇటువంటి పరిస్థితిలో, ఇది అతని చివరి ప్రపంచకప్ అని అంతా భావించారు.

ఇవి కూడా చదవండి

ఆరంభంలోనే గాయపడిన నేమార్..

క్వార్టర్-ఫైనల్స్‌లో గోల్ చేసినా నేమార్ తన జట్టును గెలిపించలేకపోయాడు. మ్యాచ్ 1-1తో టై అయిన తర్వాత పెనాల్టీ షూటౌట్‌లో క్రొయేషియా 4-2తో విజయం సాధించింది. ఈ ప్రపంచకప్‌ నేమార్‌కు కూడా ప్రత్యేకమైనది కాదు. సెర్బియాపై విజయంతో ప్రచారాన్ని ప్రారంభించిన తర్వాత మ్యాచ్‌లో నే‌మార్ గాయపడ్డాడు. ఆపై దక్షిణ కొరియాతో జరిగిన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లో తిరిగి వచ్చాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..