Euro Cup 2020: 55 ఏళ్ల తరువాత ఫైనల్‌ చేరిన ఇంగ్లండ్‌.. ఇటలీతో తుదిపోరుకు రెడీ!

యూరో కప్‌లో ఇంగ్లండ్ టీం సత్తా చాటింది. 55 ఏళ్ల తరువాత మొదటిసారి ఫైనల్ పోరులోకి ఎంటరైంది. రెండో సెమీఫైనల్‌ మ్యాచ్‌లో భాగంగా ఇంగ్లండ్‌ జట్టు డెన్మార్క్ తో తలపడింది. ఈ మ్యాచ్‌లో 2-1 తేడాతో ఇంగ్లండ్ విజయం సాధించింది.

Euro Cup 2020: 55 ఏళ్ల తరువాత ఫైనల్‌ చేరిన ఇంగ్లండ్‌.. ఇటలీతో తుదిపోరుకు రెడీ!
Euro2020

Updated on: Jul 08, 2021 | 7:59 AM

Euro Cup 2020: యూరో కప్‌లో ఇంగ్లండ్ టీం సత్తా చాటింది. 55 ఏళ్ల తరువాత మొదటిసారి ఫైనల్ పోరులోకి ఎంటరైంది. రెండో సెమీఫైనల్‌ మ్యాచ్‌లో భాగంగా ఇంగ్లండ్‌ జట్టు డెన్మార్క్ తో తలపడింది. ఈ మ్యాచ్‌లో 2-1 తేడాతో ఇంగ్లండ్ విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన పోరులో డెన్మార్క్‌ను చతికిలపడింది. ఓ పెద్ద టోర్నీలో సెమీస్‌ను దాటి ఇంగ్లండ్ ఫైనల్‌కు చేరడం ఇదే మొదటిసారి. ఇక ఆదివారం జరిగే తుదిపోరులో ఇంగ్లండ్ టీం.. ఇటలీతో తేల్చుకోనుంది. ఇంగ్లండ్ టీం 1966 ప్రపంచకప్‌ తర్వాత సెమీస్‌లో విజయం సాధించడం ఇదే మొదటిసారి. తొలినుంచి ఇంగ్లండ్, డెన్మార్క్ టీంలు నువ్వానేను అంటూ పోరాడాయి. 30వ నిమిషంలో డెన్మార్క్‌ ఆటగాడు డ్యామ్స్‌గార్డ్‌ పెనాల్టీ కిక్‌ను గోల్‌గా మలిచి, తొలిగోల్ ను డెన్మార్క్ ఖాతాలో చేర్చాడు. అనంతరం డెన్మార్క్‌ ఆటగాళ్లు పలు పొరపాట్లు చేయడంతో… ఇంగ్లండ్ బరిలోకి వచ్చింది. దాంతో నిర్ణీత సమయంలో ఇంగ్లండ్, డెన్మార్క్ లు 1-1తో సమానంగా నిలిచాయి. దీంతో ఆట ఎక్స్‌ట్రా టైంవైపు సాగింది. ఇక్కడ ఇంగ్లండ్‌ జట్టు ఆటగాడు హారీ కేన్‌ పెనాల్టీ కిక్‌ను గోల్‌గా మలిచి, ఫైనల్ చేర్చాడు. డెన్మార్క్‌ జట్టు పోరాడినా గోల్‌ చేయలేక ఇంటిబాట పట్టింది.

మరోవైపు తొలి సెమీ ఫైనల్‌లో ఇటలీ ఫుట్‌బాల్‌ టీం విజయం సాధించి యూరో కప్‌ ఫైనల్లోకి ఎంటరైంది. స్పెయిన్‌ తో వెంబ్లీ స్టేడియంలో జరిగిన పోరులో ఇటలీ పెనాల్టీ షూటౌట్‌లో 4–2తేడాతో స్పెయిన్‌ పై గెలిచింది. గత 34 మ్యాచ్‌ల్లో ఇటలీ ఫుట్‌బాల్ జట్టుకి ఓటమి లేకపోవడం విశేషం. దాంతో మూడుసార్లు చాంపియన్‌ గా నిలిచిన స్పెయిన్‌ను దెబ్బకొట్టి తుదిపోరులోకి చేరింది.

Also Read:

Copa America Football: ఫైనల్ చేరిన అర్జెంటీనా.. కొలంబియాపై తిరుగులేని విజయం.. 15వ సారి కప్ కోసం..!

Happy Birthday Sourav Ganguly: 49వ వసంతంలోకి బెంగాల్ టైగర్.. విదేశాల్లో విజయాలకు కేరాఫ్ అడ్రస్..!