స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్ తన అభిమానులకు బ్యాడ్ న్యూస్ వినిపించాడు. ప్రస్తుతం పారిస్‌లో కొనసాగుతున్న ఫ్రెంచ్ ఓపెన్ 2021లో తాను ఎన్ని రోజులు కొనసాగుతానో సరిగ్గా తెలియదని 20 సార్లు గ్రాండ్‌స్లామ్ టైటిల్ విజేత ఫెడెక్స్ సంచలన ప్రకటన చేశాడు. ఫ్రెంచ్ ఓపెన్‌లో మూడు విజయాలు సాధిస్తానని తాను అనుకోలేదని అన్నాడు. ఆపరేషన్ తర్వాత మూడు గంటల 35 నిమిషాలు ఓ మ్యాచ్ ఆడటం సాధారణ విషయం కాదని ఫెడరర్ చెప్పుకొచ్చాడు. మోకాలి గాయం కారణంగా ఫ్రెంచ్ ఓపెన్ 2021 నుంచి ఫెడెక్స్ తప్పుకోనున్నాట్లుగా తెలుస్తోంది.
See you soon, ?#RolandGarros | @rogerfederer pic.twitter.com/t8nDzi27IY
— Roland-Garros (@rolandgarros) June 5, 2021
ఫ్రెంచ్ ఓపెన్ 2021 పురుషుల సింగిల్స్ మూడో రౌండ్లో భాగంగా మూడున్నర గంటల పాటు జరిగిన మూడో రౌండ్ మ్యాచ్‌లో రోజర్ ఫెదరర్.. 7-6, 6-7, 7-6, 7-5 తేడాతో 59వ ర్యాంక్ ప్లేయర్ డొమినిక్ కోఫర్‌పై అతికష్టం మీద విజయాన్ని అందుకున్నాడు. దీంతో 15వ సారి అతడు ప్రిక్వార్టర్స్ దశకు చేరాడు.
3️⃣ hours and 3️⃣6️⃣ minutes!
At 12:43 am, @rogerfederer slams the door on Koepfer 7-6(5), 6-7(3), 7-6(4), 7-5 to reach the final 16.#RolandGarros pic.twitter.com/bBeZOX3Qgc
— Roland-Garros (@rolandgarros) June 5, 2021
ఇక సోమవారం ఇటలీకి చెందిన మాటెయో బెరెటినితో నాలుగో రౌండ్‌లో 39 ఏళ్ల ఫెడెక్స్ తలపడాల్సి ఉంది. అయితే తాను ఆడతానో లేదో తెలియదని ఫెదరర్ చెప్పడం పెద్ద సంచలనంగా మారింది. ఫెడెక్స్ దాదాపు టోర్నీ నుంచి తప్పుకున్నట్లే అని క్రీడా వర్గాలు అంటున్నాయి.
That’s all, folks ?#RolandGarros pic.twitter.com/oJtCVKuym7
— Roland-Garros (@rolandgarros) June 5, 2021
స్విస్ మాస్టర్.. తన ఆల్‌టైమ్ ఫేవరెట్ వింబుల్డన్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు. జూన్ 28 నుంచి వింబుల్డన్ ప్రారంభం కాబోతోంది. ఫ్రెంచ్ ఓపెన్‌లో కొనసాగితే అతడికి వారం కూడా విశ్రాంతి దొరకదు. అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
2020 ఆరంభంలో రోజర్ ఫెదరర్ మోకాలికి రెండు సర్జరీలు జరిగాయి. దీంతో చాలా వరకూ టోర్నీలకు అతడు దూరంగా ఉంటున్నాడు. జనవరి 2020లో ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో నోవాక్ జొకోవిచ్ చేతిలో సెమీఫైనల్లో ఓడిపోయిన తరువాత ఖతార్ ఓపెన్ 2021లో మళ్లీ బరిలోకి దిగాడు. ఫెడరర్ దాదాపు 405 రోజులు తర్వాత కోర్టులోకి అడుగుపెట్టాడు. మరో రెండు నెలల్లో 40వ ఏట అడుగుపెడుతున్న ఫెడెక్స్‌కు.. టెన్నిస్‌లో వస్తున్న యువకులను ఎదుర్కోవడం సవాలుగా మారింది.