Milkha Singh: భారతదేశ దిగ్గజ అథ్లెట్ మిల్కా సింగ్.. కోవిడ్ అనంతర సమస్యలతో శుక్రవారం అర్ధరాత్రి తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఈ వార్త తెలియగానే ‘ఫ్లయింగ్ సిక్కు’ అంటూ సోషల్ మీడియాలో నివాళులు అర్పించారు. అంతే కాకుండా, సౌతాంప్టన్‌లో ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో న్యూజిలాండ్‌తో ఆడుతున్న భారత జట్టు కూడా మిల్కా సింగ్ జ్ఞాపకార్థం నల్ల రిబ్బన్‌లు ధరించి, నివాళులు అర్పించారు. మరోవైపు ఫర్హాన్ అక్తర్ హీరోగా మిల్కా సింగ్ బయోపిక్ పై ఓ సినిమా నిర్మించిన సంగతి తెలిసింది. ‘భాగ్ మిల్కా భాగ్’ పేరుతో తీసిన ఈ సినిమాలో ఫర్హాన్ అక్తర్ నటనకు ఎన్నో ప్రశంసలు అందుకున్నాడు. ఈ సినిమాలో అతని నటన మిల్కాసింగ్‌ను కూడా ఆకట్టుకుంది. అయితే ఈ సినిమాకు ముందు.. మిల్కాసింగ్ ఒప్పుకోలేదంట. కానీ, అందరూ బలవంతం చేస్తే తప్పని పరిస్థితుల్లో ఆయన ‘భాగ్ మిల్కా భాగ్’ సినిమాకు అంగీకరించారంట.
అయితే తాజాగా అనిషా దత్తా అనే జర్నలిస్ట్ షేర్ చేసిన ఓ ఫొటో వైరల్ గా మారింది. నోయిడా స్టేడియంలో పెట్టిన ఈ ఫొటో పై నెటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేయండతో అది కాస్త వైరల్‌గా మారింది. మిల్కాసింగ్ జ్ఞాపకార్థంగా నోయిడా స్టేడియంలో ఓ ఫొటోను ప్రదర్శించారు. అయితే ఈ ఫొటోలో మిల్కాసింగ్ ఫొటోకి బదులు ‘భాగ్ మిల్కా భాగ్’ సినిమాలో హీరోగా నటించిన ఫర్హాన్ అక్తర్ ఫొటోను ప్లేస్ చేశారు. దీంతో నెటిజన్లు ముందు ఆ ఫొటోను తీసేయండి అంటూ ఘాటుగా కామెంట్లు చేశారు.
“నోయిడా స్డేడియంలో పెట్టిన ఫొటో మిల్కాసింగ్‌ది కాదు. అది ‘భాగ్ మిల్కా భాగ్’ సినిమాలో హీరోగా నటించిన ఫర్హాన్ అక్తర్ ఫొటో, దయచేసి ఈ ఫొటోను మార్చండి” అంటూ ట్విట్టర్లో ఆమె క్యాప్షన్ తో అభ్యర్థించింది.
ఈ ట్వీట్.. ట్విట్టర్‌తో పాటు ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ గా మారింది. అసలు వ్యక్తికి బదులుగా వేరే వ్యక్తి ఫోటోను ఉపయోగించి నివాళులు అర్పించడంలో అర్ధం లేదంటూ కామెంట్లు చేశారు. ఇది సిగ్గుచేటు పని అని కొందరు, రియల్ హీరోకు రీల్ హీరోకి తేడా తెలియాదా మీకంటూ ఘాటుగా కామెంట్లు చేశారు.
Would request @noida_authority to replace these boards along the running track at Noida Stadium with the picture of the real Milkha Singh and not Farhan Akhtar’s character in the movie. ? pic.twitter.com/7Y60uIQ1ja
— Anisha Dutta (@A2D2_) June 20, 2021
The great government of Uttar Pradesh!!
— Tehseen Poonawalla Official ?? (@tehseenp) June 20, 2021
India doesn’t give tribute to legends like this?Whats wrong with the govt. Why are they glorifying this mere actor instead of the pride of our nation..the great Milkha Singh g.
— Surabhi Raj (@SurabhiRaj17) June 20, 2021
100% agree….to me it’s a shameful act by someone who used REEL actor picture on these hoardings. Who the hell is not aware of our REAL HERO -THE FLYING MACHINE Mr. MILKHA SINGH. @KirenRijiju -Sir, kindly look into this.
— Vivek Chauhan (@chauhan_vivek) June 20, 2021
Can’t believe this. They don’t know who is real Milkha Singh?
— Sachin Chaudhary (@sachin0505) June 20, 2021
Also Read:
Tokyo 2020 Summer Olympics: పీవీ సింధు ఒలింపిక్ పతకం సాధించడం అంత సులభం కాదు: జ్వాలా గుత్తా
IND Vs NZ, WTC Final 2021 Day 3 Live: ముగిసిన మూడవ రోజు ఆట.. న్యూజిలాండ్ స్కోర్ 101/2…