Diego Maradona: 20 ఏళ్ల క్రితం తనపై డిగో మారడోనా అత్యాచారం చేశాడు.. సంచలనంగా మారిన మహిళ ఆరోపణలు..

|

Nov 23, 2021 | 1:00 PM

రెండు దశాబ్దాల క్రితం దివంగత ఫుట్‌బాల్ క్రీడాకారుడు డిగో మారడోనా తనను అత్యాచారం చేశాడని క్యూబన్ మహిళ మావిస్ అల్వారెజ్ ఆరోపించారు. తాను యుక్తవయసులో ఉన్నప్పుడు తనపై అత్యాచారం చేశాడని 37 ఏళ్ల అల్వారెజ్ చెప్పారు...

Diego Maradona: 20 ఏళ్ల క్రితం తనపై డిగో మారడోనా అత్యాచారం చేశాడు.. సంచలనంగా మారిన మహిళ ఆరోపణలు..
Diego Maradona
Follow us on

రెండు దశాబ్దాల క్రితం దివంగత ఫుట్‌బాల్ క్రీడాకారుడు డిగో మారడోనా తనను అత్యాచారం చేశాడని క్యూబన్ మహిళ మావిస్ అల్వారెజ్ ఆరోపించారు. తాను యుక్తవయసులో ఉన్నప్పుడు తనపై అత్యాచారం చేశాడని 37 ఏళ్ల అల్వారెజ్ చెప్పారు. గతేడాది నవంబర్‌ 25న మారడోనా ఓ శస్త్ర చికిత్స అనంతరం కన్నుమూశాడు. ఇటీవల అతడికి సంబంధించిన కొన్ని విషయాలపై క్యూబాకు చెందిన 37 ఏళ్ల మహిళ పలు ఆరోపణలు చేశారు. ‘మానవ అక్రమ రవాణా, మాదక ద్రవ్యాలు, భౌతిక దాడులు వంటి నేరాలకు మారడోనా అనుచరులు పాల్పడ్డారని ఆమె ఇటీవల అమెరికన్‌ మీడియా వద్ద ప్రస్తావించారు. ఈ వ్యవహారంలో బాధిత మహిళ వారిపై ఫిర్యాదు చేయకపోయినా అర్జెంటీనాకు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ విచారణ చేపట్టింది.

అల్వారెజ్ అర్జెంటీనా న్యాయ మంత్రిత్వ శాఖ కోర్టుకు గత వారం వాంగ్మూలం ఇచ్చింది. తాను టీనేజ్‌లో ఉండగా మారడోనాతో ఏం జరిగిందో చెప్పింది. ‘నేను టీనేజ్‌లో ఉండగా 2001లో మారడోనాను కలిశాను. అప్పుడు ఆయన డ్రగ్స్‌ వినియోగానికి సంబంధించిన చికిత్సలో భాగంగా క్యూబాకు వచ్చాడు. ఆ సమయంలో నాపై ఓ సందర్భంలో అత్యాచారం చేశాడు. అప్పుడు మారడోనాతో నాలుగైదేళ్ల పాటు సన్నిహితంగా ఉన్నా. ఆ సమయంలో నన్ను చిత్ర హింసలకు గురిచేయడమే కాకుండా మాదక ద్రవ్యాలు తీసుకోవాలని బలవంతం చేశాడు. పలు సందర్భాల్లో భౌతిక దాడులు చేశాడు. దీంతో అమితంగా ఇష్టపడిన అతడిని తర్వాత అసహ్యించుకున్నా’ అని ఆమె చెప్పారు.

అల్వారెజ్ తన తల్లి పక్క గదిలో ఉండగా, తాను ఉంటున్న హవానాలోని క్లినిక్‌లో మారడోనా తనపై అత్యాచారం చేశాడని ఆరోపించారు. “అతను నా నోరు మూసిరేప్ చేశాడని చెప్పింది. ఇకపై ఈ విషయాల్లో తాను ఎలాంటి జోక్యం చేసుకోనని, తాను చెప్పాల్సింది మొత్తం కోర్టుకు తెలిపానని బాధిత మహిళ అన్నారు. ఇన్నేళ్ల తర్వాత ఈ విషయాలపై నోరు విప్పడం సంతోషంగా ఉందన్నారు. తనలాంటి పరిస్థితి మరెవరికీ రావొద్దన్నారు.

Read Also.. India vs New Zealand, 1st Test: బయో బబుల్ రూల్స్ బ్రేక్ చేసిన ద్రవిడ్-రహానే.. ఎక్కడికి వెళ్లారంటే?