Tokyo Olympics 2021: టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన అథ్లెట్లకు కోవిడ్ వ్యాక్సిన్ పూర్తి…

|

May 22, 2021 | 10:03 PM

Tokyo Olympics: టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన 148 మంది అథ్లెట్లు కరోనా మొదటి డోస్ వ్యాక్సిన్ వేసుకున్నారని భారత ఒలింపిక్ సమాఖ్య (ఐఓఏ) అధ్యక్షుడు నరేందర్ బత్రా తెలిపారు. పారా ఒలింపిక్స్ ఆటగాళ్లతో కలిసి ఈ సంఖ్య 163 అని

Tokyo Olympics 2021: టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన అథ్లెట్లకు కోవిడ్ వ్యాక్సిన్ పూర్తి...
Tokyo Olympics 2021
Follow us on

టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన 148 మంది అథ్లెట్లు కరోనా మొదటి డోస్ వ్యాక్సిన్ వేసుకున్నారని భారత ఒలింపిక్ సమాఖ్య (IFA) అధ్యక్షుడు నరేందర్ బత్రా ప్రకటించారు . పారా ఒలింపిక్స్ ఆటగాళ్లతో కలిసి ఈ సంఖ్య 163 మంది ఉన్నారని ఆయన తెలిపారు. 148 మంది అథ్లెట్లలో ఇప్పటికే 17 మంది రెండు డోసులు తీసుకున్నారన్నారు. 148 మంది జూలై 23న ప్రారంభమయ్యే టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొననున్నారు. కోవిడ్ కట్టడిలో భాగంగా భారత దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతోన్న సంగతి తెలిసిందే.

గతేడాది జరగాల్సి ఉన్న ఒలింపిక్స్ కరోనా వ్యాప్తి నేపథ్యంలో వాయిదాపడింది. ఈ ఏడాది కూడా మెగా టోర్నీ జరుగుతుందో లేదో అన్న అనుమానాలు చాలా మంది క్రీడాకారులు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ  ఉపాధ్యక్షుడు జాన్‌ కోట్స్‌ పలు కీలక విషయాలను వెల్లడించారు. కోవిడ్ ఉద్ధృతి కారణంగా జపాన్‌లోని టోక్యోతో సహా మిగతా ప్రాంతాల్లో అత్యయిక స్థితి ఉన్నప్పటికీ.. మరో రెండు నెలల్లో ఒలింపిక్స్‌ ఆరంభమవుతాయని వెల్లడించారు. ఏడాది పాటు వాయిదా పడ్డ ఆ మెగా క్రీడల నిర్వహణకు బాధ్యుడిగా ఉన్న అతను.. టోక్యో నిర్వాహకులతో జరిగిన మూడు రోజుల తుది ప్రణాళిక సమావేశాల ముగింపు కార్యక్రమంలో వర్చువల్‌గా మాట్లాడారు.

జులై 23న ఆరంభించాలని తలపెట్టిన ఒలింపిక్స్‌ను నిర్వహించకూడదంటూ 60-80 శాతం జపాన్‌ దేశ ప్రజలు కోరుతున్నట్లు సర్వేల్లో తేలింది. అయితే ప్రజలందరూ టీకా తీసుకుంటే ఆ అభిప్రాయంలో మార్పు వస్తుందని జాన్‌ కోట్స్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి : Amalapuram: అమలాపురంలో ఆస్పత్రులకు షాకిచ్చిన అధికారులు.. అధిక ఫీజు వసూలు చేసినందుకు రూ.7 లక్షల జరిమానా

Most Successful Captains: టీ20 క్రికెట్‌ ఉత్తమ విజేతలు.. జట్టుకు అత్యధిక విజయాలను అందించిన సారథులు వీరే..