Asian Champions Trophy Hockey 2024: నేటి (సెప్టెంబర్ 8) నుంచి హాకీ టోర్నీతో ఆసియా ఛాంపియన్‌షిప్ ట్రోఫీ ప్రారంభం కానుంది. మంగోలియాలోని హులున్‌బుయిర్ సిటీలోని మోకి ట్రైనింగ్ బేస్ గ్రౌండ్‌లో జరిగే ఈ టోర్నీలో మొత్తం 6 జట్లు తలపడనున్నాయి. నేడు జరిగే తొలి మ్యాచ్‌లో జపాన్, దక్షిణ కొరియా జట్లు తలపడగా, రెండో మ్యాచ్‌లో మలేషియా, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. మూడో మ్యాచ్‌లో భారత జట్టు చైనా జట్టుతో తలపడనుంది. అలాగే సెప్టెంబర్ 14న జరిగే హైవోల్టేజీ మ్యాచ్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి.
భారతదేశం
చైనా
పాకిస్తాన్
మలేషియా
జపాన్
దక్షిణ కొరియా.
సెప్టెంబర్ 8, ఆదివారం | దక్షిణ కొరియా vs జపాన్ | 11:00 AM |
సెప్టెంబర్ 8, ఆదివారం | మలేషియా vs పాకిస్థాన్ | 1:15 PM |
సెప్టెంబర్ 8, ఆదివారం | భారత్ vs చైనా | 3:30 PM |
సెప్టెంబర్ 9, సోమవారం | దక్షిణ కొరియా vs పాకిస్థాన్ | 11:00 AM |
సెప్టెంబర్ 9, సోమవారం | భారత్ vs జపాన్ | 1:15 PM |
సెప్టెంబర్ 9, సోమవారం | చైనా vs మలేషియా | 3:30 PM |
సెప్టెంబర్ 11, బుధవారం | పాకిస్థాన్ vs జపాన్ | 11:00 AM |
సెప్టెంబర్ 11, బుధవారం | మలేషియా vs భారతదేశం | 1:15 PM |
సెప్టెంబర్ 11, బుధవారం | చైనా vs దక్షిణ కొరియా | 3:30 PM |
సెప్టెంబర్ 12, గురువారం | జపాన్ vs మలేషియా | 11:00 AM |
సెప్టెంబర్ 12, గురువారం | దక్షిణ కొరియా vs భారతదేశం | 1:15 PM |
సెప్టెంబర్ 12, గురువారం | పాకిస్థాన్ vs చైనా | 3:30 PM |
సెప్టెంబర్ 14, శనివారం | మలేషియా vs దక్షిణ కొరియా | 11:00 AM |
సెప్టెంబర్ 14, శనివారం | భారత్ vs పాకిస్థాన్ | 1:15 PM |
సెప్టెంబర్ 14, శనివారం | జపాన్ vs చైనా | 3:30 PM |
సెప్టెంబర్ 16, సోమవారం | 5-6వ స్థానం కోసం మ్యాచ్ | 10:30 AM |
సెప్టెంబర్ 16, సోమవారం | సెమీఫైనల్ 1 | 1:10 PM |
సెప్టెంబర్ 16, సోమవారం | సెమీఫైనల్ 2 | 3:30 PM |
సెప్టెంబర్ 17, మంగళవారం | మూడో స్థానం కోసం మ్యాచ్ | 1:00 PM |
సెప్టెంబర్ 17, మంగళవారం | ఫైనల్ | 3:30 PM |
గోల్ కీపర్లు- క్రిషన్ బహదూర్ పాఠక్, సూరజ్ కర్కేరా.
డిఫెండర్లు – జర్మన్‌ప్రీత్ సింగ్, అమిత్ రోహిదాస్, హర్మన్‌ప్రీత్ సింగ్ (కెప్టెన్), జుగ్రాజ్ సింగ్, సంజయ్, సుమిత్
మిడ్‌ఫీల్డర్లు – రాజ్ కుమార్ పాల్, నీలకంఠ శర్మ, వివేక్ సాగర్ ప్రసాద్ (వైస్ కెప్టెన్), మన్‌ప్రీత్ సింగ్, మహ్మద్ రహీల్ మౌసీన్.
ఫార్వర్డ్‌లు- అభిషేక్, సుఖ్‌జీత్ సింగ్, అరజీత్ సింగ్ హుందాల్, ఉత్తమ్ సింగ్, గుర్జోత్ సింగ్.
ఈ టోర్నమెంట్‌లోని అన్ని మ్యాచ్‌లను సోనీ స్పోర్ట్స్ ఛానెల్‌లో ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. అలాగే, సోనీ లైవ్ యాప్‌లో లైవ్ స్ట్రీమింగ్ ఉంటుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..