Cristiano Ronaldo: కోపంతో హ్యాండ్ బ్యాండ్​ విసిరికొట్టిన రొనాల్డో.. దాన్ని వేలం వేయగా ఎంత పలికిందో తెలిస్తే..

| Edited By: Narender Vaitla

Apr 03, 2021 | 7:14 PM

 క్రిస్టియానో రొనాల్డో.. యావత్ ఫుట్‌బాల్ ప్రపంచానికి అతడో రోల్ మోడల్. అత్యంత దిగువస్థాయి నుంచి వచ్చి.. వరల్డ్‌లోనే ఏ1 ప్లేయర్‌గా నిలిచాడు రొనాల్డో.

Cristiano Ronaldo: కోపంతో హ్యాండ్ బ్యాండ్​ విసిరికొట్టిన రొనాల్డో.. దాన్ని వేలం వేయగా ఎంత పలికిందో తెలిస్తే..
Armband Ronaldo
Follow us on

Cristiano Ronaldo:  క్రిస్టియానో రొనాల్డో.. యావత్ ఫుట్‌బాల్ ప్రపంచానికి అతడో రోల్ మోడల్. అత్యంత దిగువస్థాయి నుంచి వచ్చి.. వరల్డ్‌లోనే ఏ1 ప్లేయర్‌గా నిలిచాడు రొనాల్డో. అతడి స్ఫూర్తితో చాలామంది ఫుట్‌బాల్‌ను తమ కెరీర్‌గా ఎంచుకున్నారు.. ఎంచుకుంటూనే ఉన్నారు. ఈ స్టార్ ప్లేయర్ ఆటోగ్రాఫ్ కోసం, అతడి జెర్సీ కోసం, వాడిన హ్యాండ్ బ్యాండ్ దక్కించుకునేందుకు అభిమానులు ఎంతగానే పోటీపడతారు. తాజాగా రొనాల్డో కోపంతో హ్యాండ్ బ్యాండ్‌ను గ్రౌండ్‌లో విసిరేశాడు. అనంతరం ఆ బ్యాండ్‌ను తీసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఒకరు ఒక చారిటీ సంస్థకు అందజేశాడు. దానికి సదరు స్వచ్ఛంద సంస్థ వేలం నిర్వహించగా.. ఊహించని ధర పలికింది. 64 వేల యూరోలకు(దాదాపు రూ.55 లక్షలు) ఓ వ్యక్తి దాన్ని సొంతం చేసుకున్నారు. ఈ మొత్తాన్ని వెన్నెముక కండరాల క్షీణతతో బాధపడుతున్న ఆరు నెలల చిన్నారి సర్జరీ కోసం ఉపయోగించనున్నారు. మూడు రోజుల పాటు జరిగిన ఈ వేలం ఎలాంటి వివాదాలకు చోటులేకుండా ముగిసింది.

అసలు ఈ బ్యాండ్ వెనుక ఉన్న స్టోరీ ఏంటి..?

పోర్చుగల్ జట్టుకు కెప్టెన్‌గా రొనాల్డో వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.  ఫుట్‌బాల్ ప్రపచంకప్‌లో నేపథ్యంలో గతవారం సెర్బియాతో జరిగిన క్వాలిఫయర్ మ్యాచ్‌లో ఇరు జట్లూ 2-2 గోల్స్‌తో ఈక్వల్‌గా నిలిచాయి. చివరి నిమిషంలో రొనాల్డో ఓ గోల్‌ చేశాడు. అంపైర్ దానిని పరిగణలోకి తీసుకోలేదు. ఈ క్రమంలోనే ఆగ్రహానికి గురైన అతడు.. తన చేతికున్న కెప్టెన్ ఆర్మ్ బ్యాండ్‌ను తీసి కోపంతో నేలపై విసిరి వెళ్లిపోయాడు.

 

Also Read: టీటీడీ సంచలన నిర్ణయం.. పదవీ విరమణ చేసిన అర్చకులను విధుల్లోకి తీసుకుంటూ ఉత్తర్వులు

50 గంట‌ల పాటు స‌జీవ స‌మాధి.. యూట్యూబ‌ర్ స్టంట్‌.. చివరకు ఏమైందంటే..?‌