హర్యానాకు చెందిన 17 ఏళ్ల మహిళా రెజ్లర్ యాంటీమ్ పంఘల్ చరిత్ర సృష్టించింది. U20 ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన తొలి భారతీయ అమ్మాయిగా నిలిచింది. 53 కేజీల విభాగం ఫైనల్ మ్యాచ్‌లో ఆమె కజకిస్థాన్‌కు చెందిన అట్లిన్ షగయేవాపై 8-0 తేడాతో విజయం సాధించింది. 34 ఏళ్ల ఈ టోర్నీ చరిత్రలో ఓ భారత అమ్మాయి పోడియం అగ్రస్థానానికి చేరుకోవడం ఇదే తొలిసారి. ఈ టోర్నమెంట్‌లో పంఘల్ తన అన్ని రెజ్లింగ్ మ్యాచ్‌లను గెలవడం విశేషం. ఆమె స్వర్ణ ప్రయాణంలో యూరోపియన్ ఛాంపియన్ ఒలివియా ఆండ్రిచ్‌ను కూడా ఏకపక్షంగా (11-0) ఓడించి, షాక్ ఇచ్చింది.
బల్గేరియాలోని సోఫియాలో జరిగిన ఈ ఛాంపియన్‌షిప్‌లో సెమీ-ఫైనల్, క్వార్టర్-ఫైనల్ మ్యాచ్‌లను ఏకపక్షంగా గెలిచి, సత్తా చాటింది. ఆమె సెమీ-ఫైనల్‌లో ఉక్రెయిన్‌కు చెందిన నటాలియాను 11-2తో ఓడించగా, అంతకుముందు జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఆమె జపాన్‌కు చెందిన అయాకా కిమురాను ఓడించింది.
ఒలింపిక్స్‌లో పతకం సాధించడమే లక్ష్యంగా..
గోల్డ్ మెడల్ మ్యాచ్ గెలిచిన అనంతరం చివరిగా మాట్లాడుతూ ‘నాకు ఈ రికార్డు గురించి తెలియదు. స్వర్ణం గెలిచిన తర్వాత కోచ్ మాట్లాడుతూ.. ఈ ఛాంపియన్‌షిప్ గెలిచిన తొలి భారతీయ అమ్మాయి నువ్వేనని చెప్పారు. రెజ్లింగ్‌లో కొనసాగేందుకు నన్ను అనుమతించినందుకు నా తల్లిదండ్రులకు ధన్యవాదాలు. ముఖ్యంగా దీదీ (కబడ్డీ క్రీడాకారిణి సరిత) నన్ను ఎంతో ప్రోత్సహించారు. ఒలింపిక్స్‌లోనూ భారత్‌కు పతకం సాధించడమే నా లక్ష్యం’ అంటూ చెప్పుకొచ్చింది.
Antim ?? with a historic ? for India
The 17-year-old became the country first-ever U20 world champ in women’s wrestling at #WrestleSofia pic.twitter.com/YML41jkdDt
— United World Wrestling (@wrestling) August 19, 2022
అండర్-20 ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ 12 పతకాలు సాధించగా, ఇతర భారత ఆటగాళ్లు కూడా పతకాలు సాధించారు. 62 కేజీల విభాగంలో సోనమ్ మాలిక్, 65 కేజీల విభాగంలో ప్రియాంక రజతం సాధించారు. అదే సమయంలో 72 కేజీల విభాగంలో రితిక, 57 కేజీల విభాగంలో సిటో కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఇక్కడ పురుష ఆటగాళ్లు కూడా ఒక రజతం, 6 కాంస్యాలు గెలుచుకున్నారు.