Watch Video: పొట్టుపొట్టుగా కొట్టుకున్న ఆటగాళ్లు.. భారత్-నేపాల్ మ్యాచ్‌లో గొడవ.. వైరల్ వీడియో..

SAFF Championship: భారత ఫుట్‌బాల్ జట్టు అత్యుత్తమ ప్రదర్శన SAFF ఛాంపియన్‌షిప్‌లో కనిపిస్తోంది. నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో 2-0తో గెలుపొంది, సెమీ-ఫైనల్‌లో తన స్థానాన్ని ఖాయం చేసుకుంది.

Watch Video: పొట్టుపొట్టుగా కొట్టుకున్న ఆటగాళ్లు.. భారత్-నేపాల్ మ్యాచ్‌లో గొడవ.. వైరల్ వీడియో..
Saff 2023 India Vs Nepal

Updated on: Jun 25, 2023 | 3:10 PM

SAFF Championship India vs Nepal: భారత ఫుట్‌బాల్ జట్టు అత్యుత్తమ ప్రదర్శన SAFF ఛాంపియన్‌షిప్‌లో కనిపిస్తోంది. నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో 2-0తో గెలుపొంది, సెమీ-ఫైనల్‌లో తన స్థానాన్ని ఖాయం చేసుకుంది. భారత్ తరపున రెండో గ్రూప్ మ్యాచ్‌లో కెప్టెన్ సునీల్ ఛెత్రి, మహేశ్ సింగ్ గోల్స్ చేశారు. ఈ మ్యాచ్ సందర్భంగా ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

ఈ మ్యాచ్ 64వ నిమిషంలో ఇరు జట్ల ఆటగాళ్లు పరస్పరం పోట్లాడుకోవడం కనిపించింది. హెడర్ విషయంలో భారత్‌కు చెందిన రాహుల్ భేకే, నేపాల్‌కు చెందిన బిమల్ ఘర్తీ మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఆటగాళ్లిద్దరూ గొడవకు దిగారు. వారిద్దరికి తోడు మిగిలిన ఆటగాళ్లు కూడా చేరడంతో గొడవ పెద్దదిగా మారింది. విషయం మితిమీరుతుండడంతో రిఫరీ వచ్చి ఇరు జట్ల ఆటగాళ్లను శాంతింపజేశాడు.

తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను ఓడించిన భారత్..

SAFF ఛాంపియన్‌షిప్‌లో భారత జట్టు తన తొలి మ్యాచ్‌ను పాకిస్థాన్‌తో ఆడింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ సునీల్ ఛెత్రి వరుసగా 3 గోల్స్ చేశాడు. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 4-0 తేడాతో విజయం సాధించింది. ఆసియా ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా సునీల్ ఛెత్రి ఇప్పుడు రెండో స్థానంలో ఉన్నాడు. మొదటి స్థానాన్ని కైవసం చేసుకునేందుకు భారత్, కువైట్‌లు ఇప్పుడు జూన్ 27న తలపడనున్నాయి. అదే రోజు పాకిస్థాన్, నేపాల్ జట్లు డెడ్ రబ్బర్ మ్యాచ్ ఆడనున్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..