Sachin Tendulkar: మాస్టర్‌ బ్లాస్టర్‌ క్రికెట్‌ ప్రస్థానం మొదలైంది ఈరోజే..

|

Nov 15, 2021 | 1:57 PM

సచిన్‌ రమేశ్‌ టెండూల్కర్‌... అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ పేరుకున్న క్రేజ్‌ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లో వేలకొద్దీ పరుగులు, వందలాది సెంచరీలు

Sachin Tendulkar: మాస్టర్‌ బ్లాస్టర్‌ క్రికెట్‌ ప్రస్థానం మొదలైంది ఈరోజే..
Follow us on

సచిన్‌ రమేశ్‌ టెండూల్కర్‌… అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ పేరుకున్న క్రేజ్‌ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లో వేలకొద్దీ పరుగులు, వందలాది సెంచరీలు సాధించిన అతడు క్రికెట్‌ స్వరూపాన్ని పూర్తిగా మార్చేశాడు. అందుకే అభిమానులందరూ ‘క్రికెట్‌ దేవుడి’ గా అతడిని పరిగణిస్తారు. ఎందరో యువ క్రికెటర్లకు స్ఫూ్ర్తిగా నిలిచే ఈ మాస్టర్‌ బ్లాస్టర్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టి 32 వసంతాలు పూర్తయ్యాయి. 1989 నవంబర్‌ 15న కరాచీ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌తో సచిన్‌ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. అప్పుడు అతని వయసు కేవలం 16 ఏళ్లు మాత్రమే.

16 ఏళ్ల ప్రాయంలో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన మొదటి క్రికెటర్‌గా గుర్తింపు పొందిన సచిన్‌ తొలి మ్యాచ్‌లోనే వకార్‌ యూనిస్‌ లాంటి అరవీర భయంకర బౌలర్లకు ఎదురొడ్డి నిలిచాడు. ఇదే అతడి క్రికెట్‌ ప్రస్థానానికి నాంది పలికింది. ఆ తర్వాత వందలాది సెంచరీలు, వేలాది పరుగులు సాధించి ‘గాడ్‌ ఆఫ్‌ క్రికెట్‌’గా అభిమానుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించాడు. 2013 నవంబర్‌ 16 న సచిన్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. ఈ సందర్భంగా ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లో సచిన్‌ ప్రస్థానాన్ని పురస్కరించుకుని బీసీసీఐ ఓ ట్వీట్‌ చేసింది. తను అరంగేట్రం చేసినప్పుడు, 2013లో ఆటకు వీడ్కోలు పలికినప్పటి ఫొటోలను కొలేజ్‌ చేస్తూ ఓ అద్భుతమైన ఫొటోను పంచుకుంది. ‘సరిగ్గా ఈ రోజే క్రికెట్ ఆట స్వరూపం మారిపోయింది. భారతీయుల క్రికెట్‌ ఆరాధ్య దైవం అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు’ అని పేర్కొంది. ఈ సందర్భంగా పలువురు క్రికెటర్లు, అభిమానులు సచిన్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్‌లు పెడుతున్నారు.

T20 World Cup 2021: బాబర్‎కు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ ఇవ్వకపోవడంపై షోయబ్ అక్తర్ అసంతృప్తి.. ఇదేమిటంటూ ట్వీట్..

David Warner’s wife: వ్యంగ్యంగా ట్వీట్ చేసిన డేవిడ్ వార్నర్ భార్య.. ఎవరిని ఉద్దేశించి చేసిందంటే..!

T20 World Cup 2021: షూస్‌లో బీర్లు తాగుతూ.. షాంపెయిన్‌ బాటిల్స్‌ పొంగిస్తూ.. ఆసీస్‌ క్రికెటర్ల సంబరాలు మాములుగా లేవుగా..