Chess Olympiad in Chennai: ప్రపంచ చెస్ ఒలింపియాడ్ 2022కి చెన్నై వేదికైంది. తమిళనాడు(Tamil Nadu)లో నిర్వహించడంపై ఆనందం వ్యక్తం చేశారు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(MK Stalin). తమిళనాడు రాష్ట్రానికి ఇది గర్వకారణమన్నారు. ఇందుకు సంబంధించిన ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ సమర్పించిన బిడ్‌ను FIDE కౌన్సిల్ ఆమోదించింది. చెన్నైలో జరగనున్న 44వ ప్రపంచ చెస్ ఒలింపియాడ్ 2022కి భారతదేశం ఆతిథ్యం ఇస్తున్నట్లు ప్రకటించింది ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్. ఈవెంట్ జూలై మంత్ ఎండింగ్ నుండి ఆగస్టు నెల వరకు జరుగుతుంది తెలిపింది. నిర్వాహణ తేదీలు దగ్గర పడడంతో బిడ్ ను ఆమోదించింది FIDE కౌన్సిల్.
“44వ చెస్ ఒలింపియాడ్‌కు భారతదేశం యొక్క చెస్ రాజధాని ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉందని చెప్పారు సీఎం స్టాలిన్. ప్రపంచ ఈవెంట్ కు చెన్నై వేదిక కావడం ఆనందంగా ఉందన్నారు స్టాలిన్. తమిళనాడుకు గర్వకారణమన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాజులు, రాణులందరినీ చెన్నై హృదయపూర్వకంగా స్వాగతిస్తుందంటూ ట్వీట్ చేశారు సీఎం స్టాలిన్.
Delighted that the Chess Capital of India is set to host the 44th Chess Olympiad! A proud moment for Tamil Nadu! Chennai warmly welcomes all the Kings and Queens from around the world!#ChessOlympiad2022
— M.K.Stalin (@mkstalin) March 15, 2022
భారతదేశం మొట్టమొదటి గ్రాండ్ మాస్టర్, మాజీ ప్రపంచ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ తమిళనాడు వాడు కావడం, అంతర్జాతీయ మాస్టర్ టైటిల్‌ను సాధించిన మొదటి భారతీయ ఆటగాడు మాన్యుయెల్ ఆరోన్ చెన్నైలో పెరగడం మరో విశేషం. వాస్తవానికి, చెన్నై గతంలో 2013 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు ఆతిథ్యం ఇచ్చింది, ఇక్కడ ఆనంద్‌ను ఓడించి మాగ్నస్ కార్ల్‌సెన్ మొదటిసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచాడు. అయితే 44వ ఒలింపియాడ్… మాస్కో, ఖాంటీ-మాన్సిస్క్‌లలో జరగాల్సి ఉంది. ఉక్రెయిన్‌లో యుద్ధంపై FIDE ప్రతిస్పందన తర్వాత రష్యా నుండి తరలించారు. ఇప్పడు చెన్నై వేదిక కానుంది.
It’s official now….India will host the 44th World Chess Olympiad 2022 at Chennai!! @DrSK_AICF @Bharatchess64 @Media_SAI @FIDE_chess @ChessbaseIndia @chesscom_in
— All India Chess Federation (@aicfchess) March 15, 2022
Read Also….