ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత స్టార్ బాక్సర్ మేరీ కోమ్ కాంస్యంతోనే సరిపెట్టుకుంది. ఈ మెగాటోర్నీలో పసిడి ఆశలు కల్పించిన ఆమె… రష్యాలోని ఉలాన్ ఉద్ వేదికగా శనివారం జరిగిన సెమీఫైనల్లో ఓటమిపాలైంది. ప్రత్యర్థి బుసెనాజ్(టర్కీ) చేతిలో 4-1 తేడాతో పరాజయం చెందింది. 51 కేజీల విభాగంలో పోటీ పడిన మేరీ.. తొలిసారి ఈ విభాగంలో కాంస్యం సాధించింది. గతంలో ఈమె 48 కేజీల విభాగంలో పోటీపడేది. వచ్చే ఏడాది జరగబోయే ఒలింపిక్స్ కోసం తన విభాగం మార్చుకుంది.
మ్యాచ్ అనంతరం రిఫరీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ భారత్ అప్పీల్ చేసినా… ఫలితం మేరీకి వ్యతిరేకంగానే వచ్చింది. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో ఇప్పటివరకు 7 పతకాలు (ఆరు స్వర్ణాలు, ఒక రజతం) గెలిచింది మేరీ కోమ్. ఈ తాజా మ్యాచ్లో 8వ మెడల్ (కాంస్యం) ఖాతాలో వేసుకుంది.
Mary ke #PunchMeinHaiDum?
A record 8th medal for the legend as she ends her campaign at #WWCHs2019 completing her brilliant @AIBA_Boxing World Championships medal galore with a Bronze?
Goes down 1-4 in Semifinals to Busenaz Cakiroglu of Turkey! #Kudos @MangteC @BFI_official ? pic.twitter.com/PHtQREbCiG— Team India (@WeAreTeamIndia) October 12, 2019
How and why. Let the world know how much right and wrong the decision is….https://t.co/rtgB1f6PZy. @KirenRijiju @PMOIndia
— Mary Kom (@MangteC) October 12, 2019
తాను పరాజయం పొందడంపై తీవ్ర నిరాశకు లోనైన బాక్సర్ మేరీకోమ్ ప్రధాని మోదీ, కేంద్ర క్రీడా మంత్రి కిరణ్ రిజెజులను ట్యాగ్ చేస్తూ ఓ ట్వీట్ చేసింది. తన విషయంలో తీసుకున్న నిర్ణయం సరైనదేనా, కాదా అనే విషయం ప్రపంచానికి తెలియజేయాలని కోరింది.
How and why. Let the world know how much right and wrong the decision is….https://t.co/rtgB1f6PZy. @KirenRijiju @PMOIndia
— Mary Kom (@MangteC) October 12, 2019