Lionel Messi Retirement: ఫుట్‌బాల్‌కు మెస్సీ గుడ్ బై! కన్నీళ్లు పెట్టిస్తున్న రిటైర్మెంట్ పోస్ట్..

అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్ ప్రకటించినట్లు సమాచారం. అర్జెంటీనా జాతీయ జట్టు తరపున ఇకపై ఆడకూడదని మెస్సీ నిర్ణయించినట్లు ఫుట్‌బాల్ జర్నలిస్ట్ ఫాబ్రిజియో రొమానో వెల్లడించారు. సోమవారం తన ఎక్స్ పేజీలో ఈ విషయాన్ని ప్రకటించారు.

Lionel Messi Retirement: ఫుట్‌బాల్‌కు మెస్సీ గుడ్ బై! కన్నీళ్లు పెట్టిస్తున్న రిటైర్మెంట్ పోస్ట్..
Lionel Messi Announces Retirement

Updated on: Aug 31, 2026 | 9:03 PM

అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం, ప్రపంచ ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. అర్జెంటీనా జాతీయ జట్టు తరఫున రెండు దశాబ్దాలకు పైగా కొనసాగిన తన ప్రయాణానికి ముగింపు పలుకుతున్నట్లు మెస్సీ వెల్లడించారు. ఈ నిర్ణయం తనను తీవ్రంగా బాధించిందని, అయితే సమయం ఆసన్నమైందని అర్థం చేసుకున్నానని ఆయన భావోద్వేగంగా తెలిపారు.

జాతీయ జట్టుకు వీడ్కోలు పలుకుతూ మెస్సీ చేసిన వ్యాఖ్యలు అభిమానులను కంటతడి పెట్టిస్తున్నాయి. ఫైనల్ ముగిసి చాలా కాలం గడిచిన తర్వాత, ఎంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన చెప్పారు. అర్జెంటీనా జెర్సీ కోసం తన శక్తినంతా ధారపోశానని, జట్టు విజయాల కోసం మాత్రమే కాకుండా అంతకుముందు కూడా ప్రతి మ్యాచ్‌లోనూ పూర్తి స్థాయిలో పోరాడానని తెలిపారు.

అర్జెంటీనా ప్రజలకు ఆనందాన్ని పంచడం, ఫుట్‌బాల్ ద్వారా దేశ ప్రజలు గర్వపడేలా చేయడం తనకు ఎంతో ముఖ్యమని మెస్సీ పేర్కొన్నారు. జాతీయ జట్టులో భాగంగా ఉండటాన్ని తాను ఎంతో ప్రేమించానని, ఇకపై కూడా ఆ జట్టును ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటానని చెప్పారు. తనకు ఇవ్వాల్సినదంతా ఇచ్చేశానని, ఇక తన వద్ద ఇవ్వడానికి మరేమీ మిగల్లేదని భావోద్వేగంగా వెల్లడించారు. అదే సమయంలో అర్జెంటీనా జట్టులోకి ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లు వస్తున్నారని మెస్సీ గుర్తుచేశారు. వారికి అవకాశం ఇవ్వాల్సిన సమయం వచ్చిందని సూచించారు. జాతీయ జట్టుకు దూరమైనప్పటికీ అభిమానులకు బయట నుంచి మద్దతు ఇస్తానని, మంచి సమయాల్లోనే కాకుండా కష్టకాలంలోనూ అర్జెంటీనాకు అండగా ఉంటానని చెప్పారు.

తన 20 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో అభిమానులు చూపించిన ప్రేమ, ఆప్యాయతలకు మెస్సీ కృతజ్ఞతలు తెలిపారు. ఇకపై మైదానం నుంచి అభిమానుల గొంతు వినలేకపోవడం తనకు ఎంతో బాధ కలిగిస్తుందని అన్నారు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో తనకు అండగా నిలిచిన కుటుంబ సభ్యులకు, కోచ్‌లకు, సహచర ఆటగాళ్లకు, జట్టు అధికారులకు కూడా మెస్సీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. అర్జెంటీనా జట్టుతో కలిసి ఎన్నో అద్భుతమైన, మరపురాని క్షణాలను అనుభవించానని చెప్పారు.

ఒకప్పుడు తాము కేవలం కలలుగన్న విజయాలను అభిమానులకు అందించగలిగాననే గర్వంతో జాతీయ జట్టును వీడుతున్నానని మెస్సీ తెలిపారు. చివరగా “ఐ లవ్ యూ” అంటూ అభిమానులపై తన ప్రేమను చాటుకున్నారు. “నన్ను అర్జెంటీనా వాసిగా చేసినందుకు దేవుడికి ధన్యవాదాలు” అంటూ తన సందేశాన్ని ముగించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us