కుమారా.. ఎంత పెద్ద తప్పు చేశావయ్యా.!

|

Jul 21, 2019 | 8:15 PM

ప్రపంచకప్ ఫైనల్‌లో ఓవర్ త్రో విషయంలో తాను తప్పు చేశానని.. ఆ మ్యాచ్‌కు అంపైర్‌గా వ్యవహరించిన కుమార్ ధర్మసేన ఒప్పుకున్నాడు. న్యూజిలాండ్ ఆటగాడు మార్టిన్ గప్తిల్ వేసిన త్రోకి బంతి వచ్చి బెన్ స్టోక్స్ బ్యాట్‌కు తగిలి బౌండరీకి వెళ్ళింది. దీనితో ధర్మసేన ఆరు పరుగులు ఇచ్చాడు. ఈ విషయంలో తన చేసిన తప్పుకు ఆయన చింతిస్తున్నట్లు వెల్లడించాడు. అయితే ఆ ఓవర్ త్రోపై తాను మ్యాచ్‌ అధికారులతో పాటు ఫీల్డ్‌లో ఉన్న మరొక అంపైర్‌ ఎరాస్మస్‌తో […]

కుమారా.. ఎంత పెద్ద తప్పు చేశావయ్యా.!
Follow us on

ప్రపంచకప్ ఫైనల్‌లో ఓవర్ త్రో విషయంలో తాను తప్పు చేశానని.. ఆ మ్యాచ్‌కు అంపైర్‌గా వ్యవహరించిన కుమార్ ధర్మసేన ఒప్పుకున్నాడు. న్యూజిలాండ్ ఆటగాడు మార్టిన్ గప్తిల్ వేసిన త్రోకి బంతి వచ్చి బెన్ స్టోక్స్ బ్యాట్‌కు తగిలి బౌండరీకి వెళ్ళింది. దీనితో ధర్మసేన ఆరు పరుగులు ఇచ్చాడు. ఈ విషయంలో తన చేసిన తప్పుకు ఆయన చింతిస్తున్నట్లు వెల్లడించాడు. అయితే ఆ ఓవర్ త్రోపై తాను మ్యాచ్‌ అధికారులతో పాటు ఫీల్డ్‌లో ఉన్న మరొక అంపైర్‌ ఎరాస్మస్‌తో కూడా చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. కాకపోతే ఆ తర్వాత చూసిన టీవీ రీప్లే ద్వారా తాను పెద్ద తప్పిదం చేసినట్లు తెలిసిందని స్పష్టం చేశాడు.

‘నేను తప్పిదం చేశానని అంగీకరిస్తున్నా.. మ్యాచ్ ముగిసిన తర్వాత టీవీ రీప్లేలో అది నాకు స్పష్టంగా తెలిసింది. ఇందుకు నేను చాలా బాధపడుతున్నా. మాకు టీవీ రీప్లే గ్రౌండ్‌లో చూసే వెసులుబాటు లేదు. అందరం కూడా బ్యాట్స్‌మెన్ రెండో పరుగు చేశాడని భ్రమపడ్డాం. దానితో అదనంగా నాలుగు పరుగులు ఇవ్వాల్సి వచ్చింది’. అని ధర్మసేన పేర్కొన్నాడు. ఆ సమయంలో మ్యాచ్ అధికారులు స్పష్టంగా చూసి ఉంటే.. పొరపాటు జరిగి ఉండేది కాదని ఆయన వెల్లడించాడు.

ఇది ఇలా ఉండగా న్యూజిలాండ్ విధించిన 242 పరుగుల టార్గెట్ ను చేధించే క్రమంలో ఇంగ్లాండ్ ఆఖరి ఓవర్‌ మూడు బంతులకు 9 పరుగులు చేయాల్సి ఉంది. ఆ సమయంలో గప్టిల్‌ విసిరిన త్రో బెన్‌ స్టోక్స్‌ బ్యాట్‌కు తగిలి బౌండరీ చేరగా అంపైర్‌ ధర్మసేన ఆరు పరుగులు ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత మ్యాచ్ సూపర్ ఓవర్‌కు చేరుకుంది. ఇక అది కూడా ‘టై’గా ముగియడంతో.. బౌండరీ కౌంట్ ఆధారంగా ఇంగ్లాండ్‌ను విశ్వవిజేతగా నిర్ణయించారు. అయితే ఆఖరిలో ఆ త్రోకు అంపైర్లు ఇచ్చిన ఆరు పరుగుల మీద సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేగిన సంగతి తెలిసిందే. ప్రపంచకప్‌లో అంపైర్ల తప్పిదాల వల్లే చాలా మ్యాచ్‌లు నాశనం అయిపోయానని నెటిజన్లు తీవ్ర విమర్శలు చేశారు.