కాంట్రావర్సీ కామెంట్స్‌కు కేర్ ఆఫ్ అడ్రెస్ అయిన పాకిస్థాన్ మాజీ ఆల్‌రౌండర్ అబ్దుల్ రజాక్.. టీమిండియాపై మరోసారి విరుచుకుపడ్డాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ, యార్కర్ కింగ్ జస్ప్రీత్ బుమ్రాలు తన ముందు బచ్చాలని తీవ్ర విమర్శలు చేశాడు. మోడరన్ క్రికెట్‌లో అంతర్జాతీయ పరణతి చెందిన మేటి ఆటగాళ్లు లేరన్న రజాక్.. సచిన్ టెండూల్కర్ స్థాయిని అందుకోవడం కోహ్లీకి అసాధ్యమని తెలిపాడు. ఇక బుమ్రా గురించి ప్రస్తావిస్తూ.. తాను గ్లెన్ మెగ్రాత్, వసీం అక్రమ్, షేన్ వార్న్ వంటి దిగ్గజ బౌలర్లను రఫ్ఫాడించానని.. బుమ్రాను సైతం ఓ ఆట ఆడుకునేవాడినని రజాక్ చెప్పుకొచ్చాడు.
రజాక్ ఓ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘1992 నుంచి 2007 మధ్య ఆటగాళ్లందరూ క్రికెట్‌నే ప్రాణంగా చేసుకున్నారని… అలాంటి దిగ్గజ ప్లేయర్స్.. ఇప్పటి మోడరన్ క్రికెట్‌లో కనిపించరని అన్నాడు. అటు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా మూడు విభాగాల్లోనూ మేటి ఆటగాళ్లు కరువయ్యారని చెప్పాడు. అంతేకాకుండా కోహ్లీ గురించి ప్రస్తావిస్తూ.. ఇప్పటి జనరేషన్‌కు అతడొక అద్భుతమైన ప్లేయర్.. ఇది ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే. కానీ పరుగులు సాధిస్తున్నాడని చెప్పి సచిన్ టెండూల్కర్‌తో పోల్చడం మాత్రం సరికాదని రజాక్ తెలిపాడు.
మరోవైపు సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్‌లపై కూడా పలు విమర్శలు చేసి రజాక్.. వారికంటే.. పాక్ ఓపెనర్ అహ్మద్ షెహజాద్ ఎంతో ప్రతిభావంతమైన ఆటగాడని అన్నాడు. ఇక రజాక్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. వీటిపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు.