టీమిండియా మాజీ స్వింగ్ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ తన ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్పాడు. రెండోసారి తండ్రిగా ప్రమోషన్ పొందినట్లు వెల్లడించాడు. తన సతీమణి సఫా పండంటి మగ బిడ్డను ప్రసవించినట్లు తెలిపాడు. అదేవిధంగా తన రెండో కుమారుడికి సులేమాన్ ఖాన్ అని పేరు పెట్టినట్లు పేర్కొన్నాడు. ఈ మేరకు తన చిన్నకుమారుడిని ప్రపంచానికి పరిచయం చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టాడు. తన ముద్దుల కుమారుడిని చేతుల్లోకి తీసుకుని చిరునవ్వులు చిందిస్తున్న ఫొటోను షేర్చేస్తూ.. ‘నేను, సఫా మా కుమారుడు సులేమాన్ ఖాన్‌ను ఈ ప్రపంచంలోకి ఆహ్వానించాం. తల్లీ బిడ్డ ఇద్దరూ క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నారు. మీ అందరి దీవెనలు కావాలి’ అని పఠాన్ రాసుకొచ్చాడు.
స్వింగ్ బౌలింగ్‌తో సంచలనాలు..
కాగా గుజరాత్‌లోని బరోడాకు చెందిన ఇర్ఫాన్ 2003లో టీమిండియాలోకి అడుగుపెట్టాడు. ఆ ఏడాది డిసెంబరులో ఆస్ట్రేలియాతో టెస్టు మ్యాచ్‌తో తన క్రికెట్ ప్రస్థానాన్ని ప్రారంభించాడు. మరుసటి ఏడాదే పరిమిత ఓవర్ల మ్యాచ్ల్లోకి అడుగుపెట్టి సత్తాచాటాడు. స్వింగ్ బౌలింగ్‌తో సంచలనాలు నమోదు చేసిన పఠాన్ అప్పుడప్పుడూ బ్యాట్ తోనూ మెరుపులు మెరిపించాడు. టీమిండియా తరఫున మొత్తం 120 వన్డేలు, 29 టెస్టులు, 24 టీ- 20లు ఆడాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి మొత్తం 306 వికెట్లు పడగొట్టాడు. అదే విధంగా 2,821 పరుగులు చేశాడు. 2012లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన ఇర్ఫాన్ గతేడాది అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం క్రికెట్ వ్యాఖ్యాతగా బిజీగా గడుపుతున్నాడు.
హైదరాబాద్ మోడల్‌తో నిఖా..
ఇక ఇర్ఫాన్ వ్యక్తిగత విషయానికి వస్తే.. హైదరాబాద్‌కు చెందిన మోడల్ సఫా బేగ్‌తో కలిసి 2016లో పెళ్లి చేసుకున్నాడు. అదే ఏడాది వీరికి ఇమ్రాన్ ఖాన్ పఠాన్ అనే మగబిడ్డ జన్మించాడు. ఇప్పుడు మరో బుజ్జాయి వీరి కుటుంబంలోకి అడుగుపెట్టాడు. ఈక్రమంలో రెండోసారి అమ్మానాన్నలైన ఇర్ఫాన్, సఫా దంపతులకు పలువురు క్రికెటర్లు, అభిమానులు, నెటిజన్లు శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతున్నారు.
Also Read:
‘లైగింక వేధింపులను నివారించాలంటే అమ్మాయిలు ఇలా చేయాలి’.. వివాదంగా మారిన జేఎన్‌యూ సర్క్యూలర్..
Silver Price Today: స్వల్పంగా పెరిగిన వెండి ధరలు.. ప్రధాన నగరాల్లో సిల్వర్ ధరలు ఎలా ఉన్నాయంటే..?