Manish Pandey: ఐపీఎల్‌లో ఎస్ఆర్‌హెచ్ ఓటమి.. మనీష్ పాండే బ్యాటింగ్‌పై ఆసక్తికర కామెంట్స్ చేసిన సేహ్వాగ్..

| Edited By: Ram Naramaneni

Apr 15, 2021 | 9:29 AM

IPL 2021: ఐపీఎల్ సీజన్ 14లో భాగంగా ముంబైలో కోల్‌కతా నైట్‌ రైడర్స్-హైదరాబాద్ సన్‌రైజర్స్ మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే.

Manish Pandey: ఐపీఎల్‌లో ఎస్ఆర్‌హెచ్ ఓటమి.. మనీష్ పాండే బ్యాటింగ్‌పై ఆసక్తికర కామెంట్స్ చేసిన సేహ్వాగ్..
Sehwag
Follow us on

IPL 2021: ఐపీఎల్ సీజన్ 14లో భాగంగా ముంబైలో కోల్‌కతా నైట్‌ రైడర్స్-హైదరాబాద్ సన్‌రైజర్స్ మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్‌ ఘోర పరాజయం పొందింది. అయితే ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్‌ బ్యాట్స్‌మెన్ మనీష్ పాండే బ్యాటింగ్‌పై ఇప్పుడు తీవ్ర చర్చ నడుస్తోంది. ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ బ్యాట్స్‌మన్ మనీష్ పాండే అద్భుతమైన బ్యాంటింగ్ చేశాడు. 41 బంతుల్లో 61 పరుగులు చేశాడు. అయితే, డెత్ ఓవర్‌లో మాత్రం చతికిలపడిపోయాడు. దాంతో అతని శ్రమ అంతా వృథాగా పోయింది. 188 పరుగుల లక్ష్యాన్ని సాధించడంలో ఎస్ఆర్‌హెచ్ విఫలమైంది. 5 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసి ఓటమిపాలైంది.

అయితే, మనీష్ పాండే ఇన్నింగ్స్‌పై తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సేహ్వాగ్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. మనీష్ పాండే బాగా రాణించాడని అంటూనే.. అతనిలోని లోపాన్ని ఎత్తి చూపాడు. సిక్సర్, ఫోర్ కొట్టేందుకు అనువైన బంతిని మనీష్ పాండే గుర్తించలేకపోయాడని అన్నారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సేహ్వాగ్.. మనీష్ పాండే బ్యాటింగ్ శైలిపై అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. “మనీష్ పాండే జట్టులో కీలకమైన రోల్ ప్లే చేస్తున్నాడు. క్రీజులో కుదురుకున్నాడు. ఒత్తిడిలో ఆడిన అనుభవం కూడా ఉంది. కానీ ఏం ప్రయోజనం. డెత్ ఓవర్‌లో ఒక్క బౌండరీ కొట్టలేకపోయాడు. ఇన్నింగ్స్ ఆఖరి బంతిని మాత్రం ఓ సిక్స్ కొట్టాడు. కానీ అప్పటికే మ్యాచ్ చేజారిపోయింది. అసలు అప్పటి వరకు అద్భుతంగా ఆడిన మనీష్.. చివర్లో బాధ్యత తీసుకుని బౌండరీలు కొట్టి ఉండాల్సింది. కానీ అలా చేయలేదు. ఒకవేళ మనీష్ పాండే బౌండరీలు బాది ఉంటే ఎస్ఆర్‌హెచ్‌ ఓడిపోయి ఉండేది కాదు. అయితే, బ్యాట్స్‌మెన్ క్రీజులో స్థిరపడినప్పటికీ.. కొన్నిసార్లు బంతులను కొట్టలేని పరిస్థితి ఉంటుంది. మనీష్ పాండే విషయంలో కూడా అదే జరిగిందని నా అభిప్రాయం. అతను షాట్ ఆడేందుకు అనువైన బంతిని గుర్తించలేకపోవడంతో సిక్సర్ కొట్టలేకపోయాడు.” అని సేహ్వాగ్ అభిప్రాయపడ్డాడు.

ఇదిలాఉంటే.. మనీష్ పాండే స్కోర్ చేయకుండా కట్టడి చేయడంతో సక్సస్ అయిన కేకేఆర్ కెప్టెన్ మోర్గాన్‌పై భారత మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా ప్రశంసలు కురిపించాడు. ఫీల్డింగ్ స్థానాల్లో వ్యూహాత్మక మార్పులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారని కితాబిచ్చాడు.

Also read:

prashant kishor on modi: ప్రధాని మోదీ ప్రజాదరణ కలిగిన నేత.. అయినా బెంగాల్ పీఠం మమతాదేః ప్రశాంత్ కిశోర్

Supreme Court: ఏ మత గ్రంథంలోనూ జోక్యం చేసుకోం.. పిటిషనర్‌కే రూ.50వేలు జరిమానా విధించిన సుప్రీం..