యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో మరో క్రికెట్ సంబరం జరగబోతున్నది.. మినీ ఐపీఎల్‌గా చెప్పుకునే మహిళల టీ-20 ఛాలెంజ్ సిరీస్‌కు ఎమిరేట్స్ ఆతిథ్యమిస్తోంది.. ఈ టోర్నమెంట్‌లో ఆడేందుకు భారత్‌కు చెందిన 30 మంది అగ్రశ్రేణి మహిళా క్రికెటర్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చేరుకున్నారు కూడా! షార్జా వేదికగా వచ్చే నెల నాలుగు నుంచి తొమ్మిది వరకు ఆరు రోజుల పాటు ఈ టోర్నమెంట్ జరుగుతుంది. భారత వన్డే కెప్టెన్ మిథాలీరాజ్, టీ-20 సారథి హర్మన్ ప్రీత్‌కౌర్, స్మృతి మంథాన, జెమీమా రోడ్రిగ్స్‌లు కూడా ఈ టోర్నీలో ఆడుతున్నారు.. తొమ్మిది రోజులపాటు ముంబాయిలో క్వారంటైన్‌లో ఉన్న మహిళా క్రికెటర్లు బయో బబుల్‌లోకి ప్రవేశించడానికి ముందు మరో వారం రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉంటారు.. ఈ టోర్నమెంట్‌లో సూపర్ నోవాస్, ట్రయల్ బ్లేజర్స్, వెలాసిటీ జట్లు పోటీపడుతున్నాయి.. ఈ టీమ్‌లకు వరుసగా మిథాలీరాజ్, స్మృతి మంథాన, హర్మన్ ప్రీత్‌కౌర్‌ను నాయకత్వం వహిస్తారు.. సుదీర్ఘ విరామం తర్వాత మహిళా క్రికెటర్లు మళ్లీ క్రికెట్ మైదానంలో అడుగుపెడుతున్నారు.. ఆల్ ది బెస్ట్… !!