Cricketer Rohit Sharma: నాలుగో టెస్ట్‌ మ్యాచ్‌పై రోహిత్ శర్మ ఫన్నీ పోస్ట్.. ట్రోల్ చేసిన రితికా.. రెస్పాండ్ అయిన కుల్దీప్..

|

Mar 01, 2021 | 3:16 PM

Cricketer Rohit Sharma: భారత్-ఇంగ్లండ్ పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ తరువాత మోడీ స్టేడియంపై విపరీతమైన విమర్శలు..

Cricketer Rohit Sharma: నాలుగో టెస్ట్‌ మ్యాచ్‌పై రోహిత్ శర్మ ఫన్నీ పోస్ట్.. ట్రోల్ చేసిన రితికా.. రెస్పాండ్ అయిన కుల్దీప్..
Follow us on

Cricketer Rohit Sharma: భారత్-ఇంగ్లండ్ పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ తరువాత మోడీ స్టేడియంపై విపరీతమైన విమర్శలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. టెస్ట్ క్రికెట్‌కు అనుకూలంగా పిచ్ లేదంటూ ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్లు మొదలు చాలా మంది విమర్శలు గుప్పించారు. టెస్ట్ సిరీస్‌కు పిచ్‌ను స్పిన్‌కు అనుకూలంగా ఎలా మారుస్తారంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ క్రమంలో టీమిండియా హిట్ మాన్ రోహిత్ శర్మ సోషల్ మీడియాలో ఫన్నీ పోస్ట్ చేశాడు. నరేంద్ర మోదీ స్టేడియంలో పిచ్‌పై పడుకుని దీర్ఘంగా ఆలోచిస్తున్నట్లుగా ఉన్న ఫోటోను పోస్ట్ చేసిన రోహిత్.. 4వ టెస్ట్ మ్యాచ్‌ కోసం పిచ్‌ను ఎలా సిద్ధం చేస్తున్నారో? ఏమో? ఆని క్యాప్షన్ పెట్టాడు. దాంతో ఈ ఫన్నీ పోస్ట్ తెగ వైరల్ అయ్యింది. అయితే, రోహిత్ శర్మ పోస్ట్ పై అతని భార్య రితికా రియాక్ట్ అయ్యింది. అతన్ని ట్రోల్ చేసింది. ఆ ఫన్నీ పోస్ట్‌ను చూసిన రితిక.. ‘నేను కూడా ఇలా ఉంటే బద్దకంగా ఉన్నానంటూ ఎగతాళి చేస్తావ్’ అంటూ కామెంట్ చేసింది. ఇక రితికా కామెంట్‌కు టీమిండియా బౌలర్ కుల్దీప్ యాదవ్ కూడా స్పందించాడు. రితికా కామెంట్ స్మైల్ ఎమోజీ మెన్షన్ చేశాడు. ఈ ముగ్గురు స్టార్స్ రియాక్షన్‌తో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఇదిలాఉంటే, భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య నాలుగు టెస్ట్ మ్యాచ్‌ సిరీస్‌లో భాగంగా ఇప్పటికే మూడు టెస్ట్ మ్యాచ్‌లు పూర్తయిన విషయం తెలిసిందే. రెండు మ్యాచ్‌లలో గెలిచిన టీమిండియా 2-1 లీడ్‌లో ఉంది. మార్చి 4వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా నాలుగో టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో గనుక భారత్ గెలిచినట్లయితే సిరీస్ టీమిండియా వశం కానుంది.

Rohit Sharma Inst Post:

Also read:

Reliance: మరో భారీ డీల్ కుదుర్చుకున్న రిలయన్స్.. ప్రపంచాన్ని మార్చే టెక్నాలజీపై పెట్టుబడులు పెట్టే క్రమంలో..

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తిరుపతి, చిత్తూరు పర్యటనను అడ్డుకున్న పోలీసులు, ఎయిర్ పోర్ట్ లో భీష్మించుకుని నేలపై కూర్చున్న చంద్రబాబు