Tokyo Olympics: గతేడాది జరగాల్సిన ఒలింపిక్స్ కోవిడ్-19 కారణంగా 2021కు వాయిదా పడిన సంగతి తెలిసిందే. జులై 23 నుంచి టోక్యో వేదికగా ఒలింపిక్ క్రీడలు ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 8 వరకు జరిగే ఈ క్రీడల్లో భారతదేశం నుంచి దాదాపు 117 మంది అథ్లెట్లు సత్తా చాటబోతున్నారు. ఈ లిస్టును భారత ఒలింపిక్ సంఘం ఇటీవలే విడుదల చేసింది. ఈ మేరకు వారి ప్రయాణాల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, తాజాగా ఇండియన్ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ టోక్యో ఒలింపిక్స్‌కు అందుబాటులో ఉండడం లేదంట. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం శిక్షణ సహాయ సిబ్బందిని కొద్ది మందినే అనుమతిస్తోంది. దీంతో టోక్యో ఒలింపిక్ క్రీడలకు గోపిచంద్ దూరంగా ఉండాలని నిర్ణయించకున్నట్లు తెలుస్తోంది. నేషనల్ కోచ్‌గా ఆయనకు ఈ క్రీడలకు హాజరయ్యే అవకాశం ఉంది. మరో కోచ్ అగుస్ వి సాంటోసాకు ఈసారి అవకాశం ఇచ్చేందుకు గోపిచంద్ టోక్యో ఒలింపిక్స్‌కు వెళ్లకూడదని వార్తలు వస్తున్నాయి. కాగా, భారత్ ఒలింపిక్ సంఘం కూడా ఒక్కో విభానికి గరిష్టంగా ముగ్గురు కోచ్‌లు, ఇద్దరు ఫిజియోలతో మొత్తం ఐదుగురు సహాయ సిబ్బంది మాత్రమే అనుమతిస్తోంది. దాంతో గోపిచంద్ ఇంలాంటి నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.
కాగా, పీవీ సింధు వెంట పర్సనల్ కోచ్ తే సాంగ్ పార్క్ వెళ్లనున్నారు. అలాగే డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి లతో కోచ్ మథియాస్ బో పయణమవ్వనున్నారు. వీరితో పాటు ఇద్దరు ఫిజియోలు సుమాన్ష్ శివలంక, బద్దం ఇవాంజలైన్ కూడా బయలుదేరనున్నారు. అయితే, భారత బ్యాడ్మింటన్ సంఘం ఏడుగురు కోచ్‌లు వెళ్లేందుకు అనుమతివ్వాలని ఐఓఏను కోరింది. కానీ, కోవిడ్ ప్రొటోకాల్ మేరకు అథ్లెట్ల సంఖ్యలో 33 శాతానికి మించి సహాయ సిబ్బందిని అనుమతించే వీలు లేకపోవడంతో బాయ్ వినతిని పక్కనపెట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు, టోక్యోలో కరోనా కేసులు పెరుగుతుండడంతో.. అంతర్జాతీయ ఒలింపిక్ సంఘంతో పాటు జపాన్ ప్రభుత్వం ఆలోచనలో పడ్డాయంట. క్రీడల ప్రారంభం అయ్యేలోపు పరిస్థితులు ఎలా ఉంటాయోనని ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. ఇక ఒలింపిక్స్ లో జాతీయ జెండా పతాకాధారులుగా ప్రముఖ బాక్సర్ మేరీ కోమ్ ఎంపికైంది. పురుషుల నుంచి హాకీ జట్టు కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ పతాకాధారులుగా వ్యవహరించనున్నారు. ఈమేరకు సోమవారం భారత ఒలింపిక్స్ సంఘం వీరి పేర్లను ప్రకటించింది. టోక్యో ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలో మూడు రంగుల జెండాను పట్టుకుని భారత బృందాన్ని వీరిద్దరు ముందుకు నడిపించనున్నారు. అలాగే ఒలింపిక్స్ ముగింపు వేడుకల్లో రెజ్లర్ బజరంగ్ పూనియా కూడా ఈ అవకాశం దక్కింది.
Also Read:
Happy Birthday Dhoni : మహేంద్రుడి భారీ సిక్సులు చూశారా..? నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో
India vs Sri lanka: శ్రీలంక టీంకు భారీ దెబ్బ.. టీమిండియా సిరీస్ నుంచి మాజీ కెప్టెన్ ఔట్!