వర్షం ఎఫెక్ట్: భారత్‌, వెస్టిండీస్‌ తొలి వన్డే రద్దు!

గయానా:  భారత్‌, వెస్టిండీస్‌ మధ్య మొదలైన తొలి వన్డే వర్షం కారణంగా ఫలితం తేలకుండానే రద్దైంది. మ్యాచ్‌ ఆరంభానికి ముందు వర్షం కురవడంతో ఔట్‌ఫీల్డ్‌ పచ్చిగా మారింది. దీంతో టాస్‌ ఆలస్యమైంది. మ్యాచ్‌ రెండు గంటలు ఆలస్యంగా మొదలు కావడంతో ఇన్నింగ్స్‌ను మొదట 43 ఓవర్లకు కుదించారు. ఆ తర్వాత కూడా వరుణుడు పదేపదే అంతరాయం కలిగించడంతో ఇక ఇన్నింగ్స్‌ సాగటం కష్టంగా మారింది. 13 ఓవర్ల వరకూ సాఫీగా సాగిన మ్యాచ్‌కు వరుణుడు మరోసారి అంతరాయం […]

వర్షం ఎఫెక్ట్: భారత్‌, వెస్టిండీస్‌ తొలి వన్డే రద్దు!
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 09, 2019 | 3:13 AM

గయానా:  భారత్‌, వెస్టిండీస్‌ మధ్య మొదలైన తొలి వన్డే వర్షం కారణంగా ఫలితం తేలకుండానే రద్దైంది. మ్యాచ్‌ ఆరంభానికి ముందు వర్షం కురవడంతో ఔట్‌ఫీల్డ్‌ పచ్చిగా మారింది. దీంతో టాస్‌ ఆలస్యమైంది. మ్యాచ్‌ రెండు గంటలు ఆలస్యంగా మొదలు కావడంతో ఇన్నింగ్స్‌ను మొదట 43 ఓవర్లకు కుదించారు. ఆ తర్వాత కూడా వరుణుడు పదేపదే అంతరాయం కలిగించడంతో ఇక ఇన్నింగ్స్‌ సాగటం కష్టంగా మారింది. 13 ఓవర్ల వరకూ సాఫీగా సాగిన మ్యాచ్‌కు వరుణుడు మరోసారి అంతరాయం కలిగించాడు. దాదాపు గంటకు పైగా ఇదే పరిస్థితి నెలకొనడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. రెండో వన్డే పోర్టు ఆఫ్‌ స్పెయిన్‌ వేదికగా ఈ నెల 11న జరగనుంది.