సఫారీలతో టెస్ట్ సిరీస్.. టీమిండియాకు ఊహించని షాక్!

దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌కు ముందు టీమిండియాకు షాక్ తగిలింది. యార్కర్ కింగ్, పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. వీపు వెనుక భాగాన చిన్నపాటి గాయం కారణంగా దక్షిణాఫ్రికా పర్యటన మొత్తానికి బుమ్రా దూరం కానున్నట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. మూడు టీ20ల సిరీస్‌లో బుమ్రాకు విశ్రాంతి ఇవ్వగా, ఇప్పుడు మొత్తంగా పర్యటనకే దూరం కానున్నాడు. బుమ్రా స్థానంలో ఉమేశ్ యాదవ్‌కు చోటు కల్పించినట్లు బీసీసీఐ వెల్లడించింది. మూడు టీ20లు, మూడు టెస్టు మ్యాచ్‌ల […]

సఫారీలతో టెస్ట్ సిరీస్.. టీమిండియాకు ఊహించని షాక్!

Edited By:

Updated on: Sep 25, 2019 | 12:56 PM

దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌కు ముందు టీమిండియాకు షాక్ తగిలింది. యార్కర్ కింగ్, పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. వీపు వెనుక భాగాన చిన్నపాటి గాయం కారణంగా దక్షిణాఫ్రికా పర్యటన మొత్తానికి బుమ్రా దూరం కానున్నట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. మూడు టీ20ల సిరీస్‌లో బుమ్రాకు విశ్రాంతి ఇవ్వగా, ఇప్పుడు మొత్తంగా పర్యటనకే దూరం కానున్నాడు. బుమ్రా స్థానంలో ఉమేశ్ యాదవ్‌కు చోటు కల్పించినట్లు బీసీసీఐ వెల్లడించింది. మూడు టీ20లు, మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ కోసం దక్షిణాఫ్రికా జట్టు భారత పర్యటనకు వచ్చింది. ఇప్పటికే టీ20 సిరీస్ 1-1తో సమం కాగా, అక్టోబరు 2 నుంచి విశాఖపట్నం వేదికగా తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది.

‘జస్ప్రీత్‌ 7 నుంచి 8 వారాలు జట్టుకు దూరంగా ఉంటాడు. అంటే బంగ్లాదేశ్‌తో టెస్టు ఛాంపియన్‌షిప్‌కు అతడు అందుబాటులో ఉండడు. ప్రస్తుతానికి అతడి పరిస్థితి ఇదీ. గాయాన్ని ప్రాథమిక దశలోనే గుర్తించడం మంచిదైంది. కోలుకోవడానికి రెండు నెలల సమయమే పడుతుంది. లేదంటే ఇలాంటి గాయానికి ఇంకా ఎక్కువ సమయం అవసరం అవుతుంది’ అని బీసీసీఐ అధికారి తెలిపారు.