India vs England 4th Test: మోతెరా స్టేడియంలో ఇంగ్లండ్ బౌలర్లకు మోత మోగించిన ఆ ఇద్దరు..

|

Mar 05, 2021 | 11:10 PM

India vs England 4th Test: అహ్మదాబాద్‌లోని మోతేరా స్టేడియం వేదికగా జరిగిన నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా ప్లేయర్లు..

India vs England 4th Test: మోతెరా స్టేడియంలో ఇంగ్లండ్ బౌలర్లకు మోత మోగించిన ఆ ఇద్దరు..
Follow us on

India vs England 4th Test: అహ్మదాబాద్‌లోని మోతేరా స్టేడియం వేదికగా జరిగిన నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా ప్లేయర్లు రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్ మోత మోగించారు. అద్భుతమైన బ్యాటింగ్‌తో జట్టు స్కోరును అమాంతం పెంచేశారు. తొలుత రిషబ్ పంత్ 101 పరుగులు చేసి ఔరా అనిపించగా.. ఆతరువాత వాషింగ్టన్ సుందర్ (60 నాటౌట్) పరుగులతో దుమ్ము లేపాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ 294/7(94 ఓవర్లు). దాంతో ఇప్పటి వరకు భారత్ 89 పరుగుల లీడ్‌లో ఉంది.

భారత్-ఇంగ్లండ్ మధ్య నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నాలుగో టెస్ట్ మ్యాచ్ మోతెరా స్టేడియంలో జరుగుతోంది. తొలుతు టాస్ గెలిచిన ఇంగ్లండ్ టీమ్.. బ్యాటింగ్ ఎంచుకుంది. ఫస్ట్ ఇన్నింగ్స్ మొదటు పెట్టిన ఇంగ్లండ్ టీమ్.. తొలి రోజు సాయంత్రానికే ఆల్ ఔట్ అయ్యింది. దాంతో టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్ తొలి రోజునే స్టార్ట్ చేసింది. తొలిరోజు 24/1 పరుగులు చేయగా.. రెండో రోజు ఆటను టీమిండియా ఇవాళ మొదలు పెట్టింది. అయితే, మ్యాచ్ మొదలైన కాసేపటికే పుజారా(17) వికెట్ సమర్పించుకున్నాడు. ఆ తరువాత రోహిత్ శర్మ 49 పరుగులు చేసి ఎల్‌బీడబ్ల్యూ అయ్యాడు. మొత్తంగా 146 పరుగులకే టీమిండియా 6 వికెట్లు కోల్పోయింది.

ఆ దశలో క్రీజ్‌లోకి ఎంటరైన రిషబ్ పంత్.. ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూయించాడు. పంత్‌కు తోడుగా వాషింగ్టన్ సుందర్ నిలిచాడు. ఇద్దరూ కలిసి బౌలర్ల ఓ ఆట ఆడుకున్నారు. ఇరువురి భాగస్వామ్యంలో 113 పరుగులు చేశారు. కేవలం 118 బంతుల్లోనే 101 పరుగులతో సెంచరీ పూర్తి చేసిన రిషబ్ పంత్.. 13 ఫోర్లు, 2 సిక్సర్లతో ప్రత్యర్థుల కళ్లు బైర్లు కమ్మేలా చేశఆడు. అయితే, అండర్సన్ వేసిన బౌలింగ్‌లో పంత్ షాట్ కొట్టగా రూట్ క్యాచ్ పట్టాడు దాంతో పంత్ పెవిలియన్ బాట పట్టాడు. ఇక వాషింగ్టన్ సుందర్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 60 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. 8 ఫోర్లతో వీర విహారం చేశాడు. మొత్తంగా నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ 294/7 తో ఇంగ్లండ్‌పై 89 పరుగుల లీడ్‌లో ఉంది.

Also read:

వీరేంద్ర సెహ్వాగ్ విధ్వంసం.. 35 బంతుల్లో 80 పరుగులు .. బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించిన ఇండియన్ లెజెండ్స్..

India vs England 4th Test: తొలిరోజు ఆధిపత్యం చెలాయించిన భారత్.. 205 పరుగులకు ఇంగ్లాండ్ ఆలౌట్.. ఆటముగిసే సమయానికి భారత్ స్కోరు 24/1