India Vs England 2021: ఆస్ట్రేలియాపై చిరస్మరణీయ విజయాన్ని అందుకున్న టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. వచ్చే నెల నుంచి ఇంగ్లాండ్‌తో ప్రారంభం కానున్న టెస్టు సిరీస్‌కు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా దూరమయ్యాడు. ఆసీస్‌తో జరిగిన మూడో టెస్టులో జడేజా బొటన వేలికి గాయమైన సంగతి తెలిసిందే. దీనితో ఆస్ట్రేలియాలోనే అతడికి వైద్యులు సర్జరీ నిర్వహించారు. కనీసం ఆరు వారాల పాటు విశ్రాంతి అవసరమని సూచించారు.
దీనితో ఆ ఆరు వారాలు ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ ముగిసేసరికి పూర్తవుతాయి. ఇక అనంతరం అతడికి ఫిట్‌నెస్ పరీక్ష పెట్టి సెలెక్టర్లు ఎంపిక చేస్తారు కాబట్టి.. జడేజా టెస్టులతో పాటు వన్డేలకు కూడా అందుబాటులో ఉండటం అనుమానమే. కాగా, ఆసీస్ పర్యటన ముగించుకుని గురువారం జడేజా కూడా టీమిండియాతో కలిసి స్వదేశం చేరుకున్నాడు. ఇక కొద్దిరోజుల తర్వాత రిహాబ్ కోసం జడ్డూను బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి పంపించానున్నారు.