రెండో వన్డే నుంచి పంత్ ఔట్..

|

Jan 15, 2020 | 9:19 PM

ఆస్ట్రేలియాతో రాజ్‌కోట్‌లో జరగనున్న రెండో వన్డే నుంచి వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌కు రెస్ట్ ఇచ్చింది టీం మేనేజ్‌మెంట్. మంగళవారం ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో పంత్ హెల్మెట్‌కు బంతి వేగంగా వచ్చి తాకింది.  44వ ఓవర్లో ఆసీస్‌ పేసర్‌ కమిన్స్‌ వేసిన బాల్ బ్యాటుకు తగిలి, తర్వాత హెల్మెట్‌కు కూడా బలంగా తాకింది. దీంతో అతడు హెడ్ కంకషన్‌ (తల అదరడం)తో బాధపడుతుండటంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. అందుకే అతను భారత టీమ్‌తో రాజ్‌కోట్‌ […]

రెండో వన్డే నుంచి పంత్ ఔట్..
Follow us on

ఆస్ట్రేలియాతో రాజ్‌కోట్‌లో జరగనున్న రెండో వన్డే నుంచి వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌కు రెస్ట్ ఇచ్చింది టీం మేనేజ్‌మెంట్. మంగళవారం ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో పంత్ హెల్మెట్‌కు బంతి వేగంగా వచ్చి తాకింది.  44వ ఓవర్లో ఆసీస్‌ పేసర్‌ కమిన్స్‌ వేసిన బాల్ బ్యాటుకు తగిలి, తర్వాత హెల్మెట్‌కు కూడా బలంగా తాకింది. దీంతో అతడు హెడ్ కంకషన్‌ (తల అదరడం)తో బాధపడుతుండటంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. అందుకే అతను భారత టీమ్‌తో రాజ్‌కోట్‌ వెళ్లకుండా ముంబయిలో డాక్టర్స్ అబ్జర్వేషన్‌లో ఉన్నాడు. పంత్ కోలుకునేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో అతనికి విశ్రాంతినిచ్చారు. ఫస్ట్ వన్డేలో పంత్‌కి గాయం కారణంగా కేఎల్ రాహుల్ కీపింగ్ చేశాడు. మరి రెండో వన్డేలో కూడా అతడినే కంటిన్యూ చేస్తారా అనే విషయం తేలాల్సి ఉంది.