India-South Africa: నిర్ణయాత్మక మ్యాచ్ కు వరుణుడి అడ్డు.. వర్షం కారణంగా నిలిచిపోయిన మ్యాచ్

|

Jun 19, 2022 | 9:50 PM

బెంగళూరు(Bangalore) వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న నిర్ణయాత్మకమైన ఐదో టీ20లో సౌతాఫ్రికా టాస్ నెగ్గి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ బ్యాటింగ్ కు బరిలోకి దిగింది. సిరీస్‌ డిసైడ్‌ చేసే ఈ మ్యాచ్‌లో టీమిండియా ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి....

India-South Africa: నిర్ణయాత్మక మ్యాచ్ కు వరుణుడి అడ్డు.. వర్షం కారణంగా నిలిచిపోయిన మ్యాచ్
India South Africa
Follow us on

బెంగళూరు(Bangalore) వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న నిర్ణయాత్మకమైన ఐదో టీ20లో సౌతాఫ్రికా టాస్ నెగ్గి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ బ్యాటింగ్ కు బరిలోకి దిగింది. సిరీస్‌ డిసైడ్‌ చేసే ఈ మ్యాచ్‌లో టీమిండియా ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగింది. దక్షిణాఫ్రికా(South Africa) మాత్రం ఆ జట్టు కెప్టెన్‌ టెంబా బవుమా స్థానంలో రీజా హెండ్రిక్స్‌, జన్సెన్‌ స్థానంలో ట్రిస్టన్‌ స్టబ్స్‌, షంషి ప్లేస్‌లో రబాడ తుది జట్టులోకి వచ్చారు. కేశవ్‌ మహారాజ్‌ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. కాగా.. ఈ మ్యాచ్ కు వరుణుడు ఆటంకం కలిగించాడు. టాస్‌ నెగ్గిన తర్వాత ఒక్క బంతి కూడా పడకముందే వర్షం మొదలైంది. వర్షం జోరుగా కురుస్తుండటంతో మ్యాచ్‌ జరుగుతుందా లేదా అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాగా.. కొంత సమయం తర్వాత వర్షం తగ్గడంతో మ్యాచ్ ప్రారంభమైంది. మ్యాచ్‌ను 19 ఓవర్లను కుదిస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.

వర్షం ఆటంకం కలిగించిన తర్వాత ప్రారంభమైన మ్యాచ్ లో కేశవ్‌ మహారాజ్‌ వేసిన తొలి ఓవర్లో ఇషాన్ కిషన్ రెండు భారీ సిక్సర్లు కొట్టాడు. తొలి ఓవర్ లో రెండు వరస సిక్సర్లు కొట్టి జోరుమీదున్న ఇషాన్ కిషన్ (7 బంతుల్లో 15)ను ఎంగిడి క్లీన్ బౌల్డ్ చేశాడు. 2 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 20/1. రెండో ఓవర్‌లో ఇషాన్‌ కిషన్‌ను క్లీన్‌ బౌల్డ్‌ చేసిన ఎంగిడి.. నాలుగో ఓవర్‌లో గైక్వాడ్‌ (10)ను బోల్తా కొట్టించాడు. 3.3 ఓవర్ల తర్వాత మ్యాచ్‌కు మరోసారి వర్షం అంతరాయం కలిగించింది. ప్రస్తుతం శ్రేయస్‌, పంత్‌ (1) క్రీజ్‌లో ఉన్నారు. అయితే.. మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించడంతో ఆట ఎప్పుడు సాగుతుందన్న విషయంపై ఉత్కంఠ నెలకొంది.

రాత్రి 09:45 వరకు వేచి చూసినప్పటికీ ఎలాంటి పురోగతి లేకపోవడంతో మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి